Rajinikanth: ఆ గుహలో 30 నిమిషాల పాటు రజనీ కాంత్.. అలా ఎందుకు ఉన్నారంటే?
వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. ప్రతి సినిమాలో తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. అందుకే ఆయనంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నా ఆయనకు గత కొన్నేళ్లుగా సినిమాల్లో ఓటమి చూశారు. కానీ, తాజాగా జైలర్ (Jailer Movie) మూవీతో మాత్రం అన్నిటికిమించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే తాజాగా ఓ గుహలో రజనీకాంత్ 30 నిమిషాల పాటు ఎందుకు ఉన్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
వరుసగా మూడు ప్లాప్స్: సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన పెటా (2019), దర్బార్ (2020), పెద్దన్న (2021) సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇలా నాలుగేళ్లపాటు సక్సెస్ కు దూరంగా ఉన్నారు రజనీకాంత్. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సూపర్ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. తలైవా రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మంచింది.

భార్యగా రమ్యకృష్ణ: జైలర్ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటి తమన్నా నటించిన విషయం తెలిసిందే. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ అదిరిపోయాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జైలర్ చిత్రంలో రజనీకాంత్ కు భార్యగా రమ్యకృష్ణ చేయగా.. వసంత్ రవి, మిర్నా మీనన్, సునీల్, జాకీ ష్రాఫ్, యోగిబాబు, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు.

హిమాలయాలకు: జైలర్ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. ఇక ఆగస్టు 10న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు కలెక్షన్లు వరదల పోటెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే జైలర్ మూవీ రిలీజుకు ముందే హిమాలయాలకు బయలుదేరారు రజనీకాంత్.

మహావతార్ బాబా గుహ: హిమాలయాలుకు బయలు దేరిన రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. తాజాగా అదే ఉత్తరాఖండ్ అల్మోరాలోని ద్వారహత్ కు చేరుకున్నారు రజనీ. అక్కడున్న మహావతార్ బాబా గుహలో (Babaji Cave) 30 నిమిషాల పాటు ధ్యానం చేశారు. యోగదా ఆశ్రమంలో సాధువులను కలుసుకున్నారు.
గవర్నర్ ట్వీట్: మార్గమధ్యంలో రజనీకాంత్ ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. మరుసటి రోజు ఉదయం ఝార్ఖండ్ లోని రాంచీకి బయలు దేరారు. అక్కడి గవర్నర్ సీపీ. రాధాకృష్ణన్ ను కలిసి కాసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను గవర్నర్ రాధాకృష్ణ ట్విటర్ లో షేర్ చేశారు. రాంచికీ రజనీ రావడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రియ మిత్రుడైన ఆయన్ను రాజ్ భవన్ లో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఝార్ఖండ్ వంటి గొప్ప ప్రదేశానికి రజనీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను అని గవర్నర్ రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











