»   » కిడ్నీ మార్పిడా? రజనీ ఆరోగ్యంపై షాకింగ్ రూమర్స్

కిడ్నీ మార్పిడా? రజనీ ఆరోగ్యంపై షాకింగ్ రూమర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. కబాలి షూటింగ్ అనంతరం రజనీకాంత్ ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవ్వడానికే అమెరికా వెళ్లారని చెబుతున్నప్పటికీ...తమిళ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి రజనీకాంత్ కు విదేశీ టూర్లకు వెళ్లే అలవాటే లేదు. అయితే ఆయన ఇపుడు ఇలా వెళ్లడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రజనీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాకని, దానికి చికిత్స కోసమే ఆయన అమెరికా వెళ్లారని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

rajini

ర‌జ‌నీకాంత్ న‌టించిన క‌బాలి చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తుండ‌గా...మ‌రో వైపు ర‌జ‌నీకాంత్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న‌ రోబో 2.0 చిత్రంలో నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రూమర్స్ అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతోంది.

మరో షాకింగ్ రూమర్ ఏమిటంటే....అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరుగుతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మరో వైపు రజనీకాంత్ లేకున్నా రోబో 2.0 షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసారట శంకర్. సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్సే కాబట్టి ఆయన స్థానంలో డూపును పెట్టి షూటింగ్ చేస్తున్నారని టాక్. రజనీకాంత్ గురించిన ఈ వార్తలు విని అభిమానులు షాకవుతున్నారు.

అయితే గతంలో 2011 కూడా రజనీకాంత్ కొడ్నీ మార్పిడి చేసుకుంటున్నారంటూ....ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలింది. మరి ఇపుడు జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

English summary
Superstar Rajinikanth, who is holidaying in US, is reportedly returning to India in the first week of July, and now, rumours are surfacing that the actor has undergone a kidney-related surgery in the US.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu