Rajinikanth:70 ఏళ్ల వయసులోనూ తగ్గని రజనీ కాంత్ జోరు.. బడా నిర్మాణ సంస్థతో వరుసగా సినిమాలు

ఆయన్ను అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. సినీ ఇండస్ట్రీకి మాత్రం ఆయన ఒక సూపర్ స్టార్. అవును.. ఆయనే రజనీ కాంత్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది దక్షిణాది హీరోలలో రజనీ కాంత్ ఒకరు. ఆయన నటనకు ముఖ్యంగా స్టైలిష్ పర్ఫామెన్స్ కు పెట్టింది పేరు. సినిమాల్లో రజనీ కాంత్ ఏం చేసినా అదొక స్టైల్ గానే ఉండేంది. అలా రజనీ అంటే స్టైల్.. స్టైల్ అంటే రజనీలా ఆయనకు పేరు ఉంది. అయితే ఇటీవల ఆయన సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఆయన ఆరోగ్యమే అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలు కమిట్ అయి జోరు పెంచారు తలైవా రజనీ కాంత్.

ఏప్రిల్ 14న విడుదల..

ఏప్రిల్ 14న విడుదల..

ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు తలైవా రజనీ కాంత్. ఆయన చివరిగా నటించిన చిత్రం పెద్దన్న. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం చేస్తున్న మూవీ జైలర్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉండగానే మరో రెండు సినిమాలు చేయనున్నాడు తలైవా.

ఏకంగా రెండు సినిమాలు..

ఏకంగా రెండు సినిమాలు..

ఏడు పదుల వయసులోను సినిమాలపై రజనీ కాంత్ కు ఉన్న ఆసక్తి ఆయన్ను మరిన్ని చిత్రాలు చేసేలా చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో రజనీ కాంత్ రెండు సినిమాలు చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో రోబో 2.0 వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ కొట్టిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రంతోపాటు కమల్ హాసన్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారతీయడు 2 సినిమాను కూడా లైకా ప్రొడక్షన్సే నిర్మిస్తోంది. రోబో 2.0 తర్వాత ఏకంగా రెండు సినిమాలను రజనీ కాంత్ తో తీయనుంది ఈ ప్రొడక్షన్ కంపెనీ.

రజనీ కాంత్ అభిమానులను అలరించేలా..

రజనీ కాంత్ అభిమానులను అలరించేలా..

ఈ రెండు సినిమాలు చేసేందుకు రజనీ కాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు సినిమాలు నవంబర్ 5న అంటే ఒకే రోజున ఒకేసారి చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నాయి. కాకపోతే ఈ రెండు చిత్రాలకు దర్శకులు ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో ఆ విషయాలు కూడా వెల్లడవుతాయని కోలీవుడ్ వర్గాల టాక్. శుక్రవారం లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, సీఈవో తమిళ్ మురుగన్ లు ప్రత్యేకంగా తలైవా రజనీ కాంత్ ను కలిసి ఈ సినిమాలకు సంబంధించిన చర్చలు జరిపారు. రజనీ కాంత్ అభిమానులను అలరించేలా భారీ బడ్జెట్, భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాలను నిర్మించనున్నారని మేకర్స్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X