ముఖ్యమంత్రిని పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన రజనీకాంత్.. స్టార్ హీరోపై భారీగా సెటైర్లు

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జీవితంలో ప్రధాన ఘట్టాల ఆధారంగా ప్రముఖ రచయిత ఏవీ వేలు రాసిన కలైంజర్ ఎనుమ్ థాయ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్, ఏ రాజా, మాజీ మంత్రి మారన్, ఇతర కీలక నేతలు పాల్గోన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరుణానిధితో ఉన్న తన అనుబంధాన్ని, డీఎంకే పార్టీ పటిష్టత గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ చేసిన ప్రసంగం వివరాల్లోకి వెళితే..

రజనీకాంత్ తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ.. క్లాస్‌లో కొత్త స్టూడెంట్స్ ఉంటే టీచర్‌కు ఎలాంటి సమస్య ఉండదు. అదే క్లాస్‌లో పాత విద్యార్థులు ఉండే ఆ టెన్షన్ మాటల్లో చెప్పలేం. ఎందుకంటే వారు తమ సబ్జెక్ట్‌లో ప్రావీణ్యత, మంచి మార్కులు సాధించి ఉంటారు. అలాగే సామాన్య జీవితం ప్రారంభించినా.. ఉన్నత హోదాకు ఎదిగిన టీఆర్ బాలు, కళానిధి లాంటి వారు ఉన్నారు. వారి ముందు ఏమీ మాట్లాడాలన్న టీచర్‌కు ఉన్న టెన్షన్ నాకు ఉంది అని రజనీకాంత్ అన్నారు.

Superstar Rajinikanth Makes Tamilnadu CM Stalin heavy laugh in Kalaignar Nam Thai book release event

నేను పలు విషయాలతోను, అలాగే షూటింగులతో బిజీగా ఉన్నాను. కానీ పబ్లిక్ వర్క్స్ మంత్రి ఏవీ వేలు నాకు మంచి మిత్రుడు. ఇటీవల ఓ షూటింగులో ఓ ప్రాంతంలో ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకొన్నాడు. ఆ మంచితనం కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను అని రజనీకాంత్ అన్నారు.

సినీ రచయిత, రాజకీయ నేత, ముఖ్యమంత్రి హోదాలను అనుభవించిన కరుణానిధితో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన నుంచి నేను చాలా నేర్చుకొన్నాను. రాజకీయాల్లో తనకంటూ ఒరవడిని సృష్టించుకొన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదురైనా ధీటుగా ఎదుర్కొన్నారు అని రజనీకాంత్ అన్నారు.

తమిళ రాజకీయాల్లో డీఎంకే పార్టీ మర్రిచెట్టు లాంటింది. ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొంటుంది. మర్రిచెట్టు లాంటి డీఎంకే పార్టీని ఎవరూ కదలించలేరు. ప్రజలంతా డీఎంకే పార్టీ వెంటే ఉంటారు అని తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

Superstar Rajinikanth Makes Tamilnadu CM Stalin heavy laugh in Kalaignar Nam Thai book release event

అయితే తన ప్రసంగంలో తమిళనాడులో కొత్త పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌ని ఉద్దేశించి సెటైర్లు వేశారనే విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. డీఎంకే పార్టీని విజయ్ ఎదుర్కోవడం సాధ్యం కాదనే విధంగా కామెంట్స్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏది ఏమైనా విజయ్‌ను టార్గెట్ చేయడం తమిళ రాజకీయాల్లో ఓ రకమైన చర్చకు దారి తీసింది.

రజనీ కాంత్ మంచి నటుడే కాదు. అనర్గళంగా ఎలాంటి విషయంపైనైనా మాట్లాడే వక్త. తాజా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన ప్రతీ సందర్భంలోను సీఎం స్టాలిన్, రాజా, మారన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. సుతిమెత్తని సెటైర్లు, పలు విషయాలకు హాస్యాన్ని జోడించి మాట్లాడటంతో వేదిక వద్ద ఉన్న అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం రజనీకాంత్ స్పీచ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X