»   » నేను భయపడటం లేదు, దేవుడే నిర్ణయిస్తాడు: రజనీకాంత్

నేను భయపడటం లేదు, దేవుడే నిర్ణయిస్తాడు: రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ్ల ఆయన తన అభిమానులతో సమావేశం అవ్వడం హాట్ టాపిక్ అయింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత రజనీకాంత్ అభిమానులతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పాటు ఈ సమావేశం జరుగనుంది.

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.... ఇప్పటికి తాను నటుడినేనని, అందరికీ నచ్చే సినిమాలను చేసి రంజింపజేయడమే తన కర్తవ్యమని... నా భవిష్యత్ ఏమిటనేది దేవుడే నిర్ణయిస్తాడు, ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రజనీకాంత్ అన్నారు.

భయపడుతున్నానని రాస్తున్నారు

భయపడుతున్నానని రాస్తున్నారు

రజనీకాంత్ సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు... అని మాట్లాడారు... రాసారు. నేను ఏదైనా ఒక విషయం చెప్పాలంటే నా స్థాయిలో ఆలోచిస్తాను... అని పరోక్షంగా రాజకీయాల గురించి ప్రస్తావించారు రజనీ.

మొరటు దైర్యం వద్దు

మొరటు దైర్యం వద్దు

నిర్ణయం తీసుకున్న తర్వాతే కొన్ని విషయాలు తెలుస్తాయంటే దాని గురించి కొంచె ఆలోచించాలి. నీటిలో కాలు పెడుతున్నాం. కాలు పెట్టాకే తెలుస్తుంది... దాంట్లో చాలా మొసళ్లు ఉన్నాయని. పెట్టిన కాలు వెనక్కి తీయను అంటే ఏమవుతుంది, తీయాలి... మొరటు ధైర్యం ప్రదర్శించ వద్దు. అందువల్లే వాయిదా వేస్తున్నామని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

 అలాంటి ఉద్దేశ్యం లేదు

అలాంటి ఉద్దేశ్యం లేదు

రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం తనకు ఎన్నడూ లేదని చెప్పిన రజనీకాంత్ తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉంటానని అన్నారు. తనకు అభిమానుల అండ, వారి ప్రేమ, ఆప్యాయతలే పదివేలని, వివాదాస్పద ప్రకటనలు చేసి వారిని అయోమయంలోకి నెట్టివేయడం తనకిష్టం లేదని అన్నారు.

ప్రచారాన్ని నమ్మవద్దు

ప్రచారాన్ని నమ్మవద్దు

తాను రాజకీయాల్లోకి రానున్నట్టు, వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పలువురు తమిళ ప్రజలతో పాటు, అభిమానులతో చర్చించిన తరువాతనే శ్రీలంక పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలిపారు.

English summary
"God decides what we have to do in life. Right now, he wants me to be an actor and I'm fulfilling my responsibility. If God willing, I will enter politics tomorrow. If I enter, I will be very truthful and will not entertain people who are in this to make money. I won't work with such people," Rajinikanth told his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu