»   » సీఎం కాబోతున్న రజినీకాంత్: ఏర్పాట్లు మొదలవుతున్నాయి,బాహుబలి రచయితతోనే...

సీఎం కాబోతున్న రజినీకాంత్: ఏర్పాట్లు మొదలవుతున్నాయి,బాహుబలి రచయితతోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజినీ ముఖ్యమంత్రి అవ్వటానికి రంగం సిద్దమవుతోందట. అవును..! తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యమంత్రి కానున్నారు. రాజకీయ పార్టీ పెట్టకుండానే, ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందకుండానే ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతారన్నదే కదా మీ సందేహం. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది వెండితెరపైనే.

సౌతిండియాలో హాట్ టాపిక్

సౌతిండియాలో హాట్ టాపిక్

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నాడ‌న్న విష‌యం ఇప్పుడు సౌతిండియాలో హాట్ టాపిక్. ఆయన మనసులో ఏముందో స్పష్టంగా తెలియకపోయినా... సిల్వ‌ర్ స్క్రిన్‌పై మాత్రం సూపర్‌స్టార్‌ని సీఎంగా చూపించేందుకు దర్శకుడు శంకర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. తన సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘ముదల్వన్‌' (ముఖ్యమంత్రి అని అర్థం, తెలుగులో ఒకే ఒక్కడు)కి సీక్వెల్‌ తీసే యోచనలో శంకర్‌ ఉన్నారట. అందులో రజనీకాంత్‌ని నటింపజేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Rajinikanth Meets Fans After 8 Years Over His Political Entry | Oneindia Telugu
ఇలాంటి సినిమా ఒక అవసరమే

ఇలాంటి సినిమా ఒక అవసరమే

ఎటూ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్న రజినీకి ఇప్పుడు ఇలాంటి సినిమా ఒక అవసరమే అనుకోవచ్చు. ప్రస్తుతం ‘ముదల్వన్‌' సీక్వెల్‌కి స్రిప్టు పనులు జరుగుతున్నా యని, అది కూడా ‘బాహుబలి' రైట‌ర్ విజయేంద్ర ప్రసాదే స్టోరీ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

నిరాకరించిన రజనీకాంత్‌

నిరాకరించిన రజనీకాంత్‌

మరి తొలి భాగంలో నటించేందుకు నిరాకరించిన రజనీకాంత్‌.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్క్రీన్‌పై ‘సీఎం'గా మారతారేమో అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ఈ సినిమా మాంచి హెల్ప‌వుతుంద‌ని, ఈ మూవీలో ర‌జినీ పొలిటిక‌ల్ డైలాగ్స్ త‌మిళ‌నాట మారుమోగిపోవ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది.

రజనీయే నటించాల్సి ఉంది

రజనీయే నటించాల్సి ఉంది

నిజానికి ‘ముదల్వన్‌' చిత్రంలో రజనీయే నటించాల్సి ఉంది. అప్పటి పరిస్థితుల్లో పొలిటిక‌ల్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ చేయడంపై ఆయన విముఖత చూపడంతో అది యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఖాతాలో చేరింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రజినీ తెరమీదనే కాదు బయట కూదా సీయెం అవ్వాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక సినిమా చేయటం వల్ల లాభమే అనుకుంటున్నట్టున్నాడు. ఇక శంకర్ తల్చుకుంటే ఆపాత్రని ఎంత బలంగా మలచగలడో తెలిసిందే. అంటే ఈ సినిమా ద్వారా రజినీ సీయెం అయితే ఎలా ఉంటుందీ అన్నది ముందే జనానికి చెప్పే ప్రయత్నం అనుకోవచ్చా..??

English summary
Rajinikanth acting on Mudhalvan 2 are quite high. Also if Shankar directs the Mudhalvan sequel he will definitely try to rope in Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu