దర్బార్ సెకండ్ లుక్: రజనీకాంత్ ఉగ్రరూపం, న్యూ పోస్టర్ వైరల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దర్బార్'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దర్బార్ సెకండ్ విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ ఉగ్ర రూపంలో దర్శనమిచ్చారు.
లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్‌లో విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ కొత్త పోస్టర్ వైరల్ అయింది. దర్శకుడు మురుగదాస్ ఈ న్యూ లుక్ షేర్ చేస్తూ... "యంగ్ లుక్‌తో తెలివైన వాడిగా, దమ్మున్నవాడిగా తలైవార్ కనిపించబోతున్నారు'' అని ట్వీట్ చేశారు.

రజనీకాంత్ చివరగా 1992లో వచ్చిన 'పాండ్యన్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. మళ్లీ 27 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దర్బార్ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











