‘రాణా’కు బ్రేక్-సౌందర్యతో రజనీ ‘కోచ్ అదయన్’

By Bojja Kumar

భారీ అంచనాలతో మొదలైన రజనీ 'రాణా" సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.

ఆ సినిమా సంగతి పక్కన పెడితే...రజనీ తాజగా మరో సినిమాకు కమిట్ అయ్యారు. తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కోచ్ అదయన్" సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది. హాలీవుడ్ సినిమాలైన అవతార్, టిన్ టిన్ భారీ చిత్రాలకు వాడిన 3డి టెక్నాలజీ కోచ్ అదనయన్ చిత్రానికి వాడుతున్నారు. రాణా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X