twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ సూపర్‌స్టార్ కాదట.. పాలిటిక్స్‌లోకి రాగానే ఊహించని మార్పు.. ఫ్యాన్స్‌కు షాకే..

    By Rajababu
    |

    ప్రస్తుత జనరేషన్‌లో సోషల్ మీడియా ఎంత ప్రభావమంతమైనదో చెప్పనక్కర్లేదు. సినీ రంగంలో ఇప్పుడంతా చాలా వరకు సినీ తారలు తమ సోషల్ మీడియా అకౌంట్లతో ఫ్యాన్స్‌కు చేరువ అవుతుంటారు. అందరి మాదిరిగానే సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి లాంటి వారు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే సోషల్ మీడియాలో రజనీకాంత్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

     ట్విట్టర్‌లో పేరు మార్పు..

    ట్విట్టర్‌లో పేరు మార్పు..

    ఫ్యాన్స్‌కు చేరువయ్యే ఉద్దేశంతో రజనీకాంత్ ట్విట్టర్‌లో ఓ ఖాతాను ఆరంభించారు. ఆ అకౌంట్‌ను @superstarrajini పేరుతో తెరిచారు. ఆ ఖాతా నుంచే చాలా వరకు అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. దాంతో అనూహ్యంగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ పేరును మార్చుకోవడమనే విషయం వెలుగులోకి వచ్చింది.

     ఓన్లీ రజనీకాంత్‌గానే

    ఓన్లీ రజనీకాంత్‌గానే

    2013లో ట్విట్టర్ ఖాతాను సూపర్‌స్టార్ రజనీ అనే పేరుతో తెరిచారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కేవలం రజనీకాంత్ అని స్టాటస్‌ను మార్చుకొన్నారు. అయితే ఈ మార్పు వెనుక కారణం తెలియరాలేదు.

     సూపర్‌స్టార్ కనుమరుగు

    సూపర్‌స్టార్ కనుమరుగు

    రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ రజనీకాంత్‌ను దేశంలోని సినీ ప్రేక్షకులకు ఆయన సూపర్‌స్టార్‌గానే గుర్తుంటారు. ఆయన పేరు ముందు సూపర్‌స్టార్ అని లేకపోతే ఆయన హోదాకు సరిపడదు అనేది కొత్తగా చెప్పనక్కర్లేదు.

    గంట గంటకు మార్పు

    గంట గంటకు మార్పు

    రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రజనీకాంత్ సోషల్ మీడియా అకౌంట్లు చాలా యాక్టివ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన అకౌంట్లను ఫాలోవారి అయ్యే సంఖ్య గంట గంటకు మారిపోతున్నది.

    రజనీ స్టార్ పవర్ ఇదే

    రజనీ స్టార్ పవర్ ఇదే

    ఇటీవల ఓపెన్ చేసిన ఇన్స్‌టాగ్రామ్‌లో 2 లక్షలకుపైగా, ఫేస్‌బుక్‌లో సుమారు 2 లక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండటం గమనార్హం.

    English summary
    Superstar Rajini is now just Rajinikanth, the people's leader. Superstar Rajinikanth's activity on Twitter saw a spurt only after his entry into politics. When Rajini made his Twitter debut in 2014, he was not very active on the social media platform, the way his contemporary, Kamal Haasan, who joined the micro-blogging site two years after him, was.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X