Rajinikanth: నాలుగేళ్లకు హిట్.. హిమాలయాలకు రజనీకాంత్?.. అక్కడ పూజలు

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. అభిమానులు ఆయన్ను ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాల్లో ఓటమి చూసిన ఆయన తాజాగా నటించిన సినిమా జైలర్ (Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. దీంతో రజనీకాంత్ ప్రముఖ పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు.

నటీనటులు: తలైవా రజనీ కాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జైలర్. సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మంచిన ఈ సినిమాలో రజనీ కాంత్ కు జోడీగా మిల్కీ భామ తమన్నా నటించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ అతిథిపాత్రల్లో మెరిసారు. అలాగే ఇందులో రమ్యకృష్ణ, వసంత్ రవి, మిర్నా మీనన్, సునీల్, యోగిబాబు, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు.

Superstar Rajinikanth

కలెక్షన్స్:జైలర్ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆగస్టు 10న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకు రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 144 కోట్ల షేక్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. అంతేకాకుండా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Superstar Rajinikanth

ప్లాప్ సినిమాలు:అయితే రజనీ కాంత్ నటించిన పెటా (2019), దర్బార్ (2020), పెద్దన్న (2021) సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ఇలా నాలుగేళ్లపాటు సక్సెస్ కు దూరంగా ఉన్నారు రజనీకాంత్. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సూపర్ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ విజయాన్ని ప్రస్తుతం ఆయన ఆస్వాదిస్తున్నారు.

Superstar Rajinikanth

నీలి రంగు షర్ట్:తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తారఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆగస్ట్ 12 శనివారం నాడు బద్రీనాథ్ దామ్ కి వెళ్లిన రజనీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 42 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో తలైవా నీలి రంగు షర్ట్ ధరించి ట్రెడిషనల్ గా కనిపించారు.

హిమాలయాలకు రజనీ: పూజల అనంతరం అభిమానులందరికీ రజనీకాంత్ అభివాదం చేశారు. ఆలయ ప్రాంగణంలో రజనీకాంత్ కలియతిరిగిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే జైలర్ రిలీజ్ తర్వాత రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్లాడని రూమర్స్ విపరీతంగా వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X