తమిళులకు కొత్త ఏడాది శుభాకాంక్షలు.. సూపర్ స్టార్ సందేశం
తెలుగువారికి ఉగాది ఎలా కొత్త సంవత్సరమో.. తమిళులకు పుత్నాడు కొత్త ఏడాది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళులకు నేడు పుత్నాడు శుభాకాంక్షలను తెలిపాడు. ఈ మేరకు ఓ సందేశాన్ని ఇచ్చాడు. దీంతో పాటు తన కార్యకర్తలను ప్రశంసించాడు. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకని కార్యకర్తలు చేస్తున్న కృషిని కొనియాడాడు. ఈ మేరకు రజినీ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సూపర్ స్టార్ చేసిన ట్వీట్ సారాంశమేంటో ఓ సారి చూద్దాం.
'ఈ ఏడాది అందరికీ మంచి జరగాలి. ఇలాంటి విపత్కర సమయంలో సేవ చేస్తున్న రజినీ మక్కల్ మండ్రం కార్యకర్తలందరినీ ప్రశంసిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం విధించే నియమాలకు లోబడి అందరూ క్షేమంగా ఉండాలి.. త్వరలోనే అంతా సర్దుకుంటుంద'ని ట్వీట్ చేశాడు.

రజినీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తె అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మీనా, కుష్బూ, కీర్తి సురేష్ వంటి వారు నటిస్తున్నారు. రజినీకాంత్ తదుపరి చిత్రంగా కమల్ హాసన్ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలె చంద్రముఖి 2 సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చేసింది.


Click it and Unblock the Notifications











