విక్రమ్ ‘మహావీర్ కర్ణ’... దుర్యోధనుడి పాత్రలో ప్రముఖ నటుడు!
సౌత్ స్టార్ విక్రమ్ హీరోగా 'మహావీర్ కర్ణ' అనే భారీ చిత్రం ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఆర్‌ఎస్ విమల్ రూ. 300 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో కొన్ని రోజుల క్రితమే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ మెగా బడ్జెట్ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపీ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన దుర్యోధనుడిగా కనిపించబోతున్నారట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ మూడు భాషల్లో రూపొందిస్తున్నారు.

'మహావీర్ కర్ణ' చిత్రానికి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేశారు. 30 అడుగుల ఎత్తైన రథం సెట్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ రథంలో అలంకరణగా ఉండే గంటకు ఇటీవల కేరళ పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న విక్రమ్ జనవరి, 2019లో సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం సినిమాలో పాత్రకు తగిన విధంగా తన శరీరాకృతిని మార్చుకోవడంలో బిజీగా ఉన్నారు. 2020 ప్రథమార్థం నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











