సురేష్ విలనావతారం ఫలించేనా??
రెండు దశాబ్దాల క్రితం హీరోగా 'సూరిగాడు", 'మామగారు" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సురేష్ విలన్ అవతారం ఎత్తాడు. సుమన్ మార్గంలో నడుస్తూ,శివాజీ ప్రొడక్షన్ బ్యానర్లో ప్రభు నిర్మాణ సారధ్యం వహిస్తూ సరన్ దర్శకత్వంలో రూపొందిన 'అసల్" అనే తమిళ చిత్రంలో విలన్ గా నటించాడు. అజిత్ హీరోగా, సమీరా రెడ్డి, భావన హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదలవుతోంది. హీరో డిఫెరెంట్ గెటప్స్ తో కనబడడంతో సినిమాపై ఆసక్తి నెలకుంది. శరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 'శివాజీ" చిత్రంలో సుమన్ విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నట్లు సురేష్ కూడా విలన్ గా ఇమేజ్ తెచ్చుకుంటాడేమో వేచి చూడాల్సిందే.
More from Filmibeat
సురేష్ అజిత్ సమీరా రెడ్డి భావన యోగి సేతు శివాజీ సుమన్ అసల్ suresh ajith sameera reddy bhavana yughi sethu sivaji suman asal


Click it and Unblock the Notifications











