twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్య కోసం సూర్యానే వస్తున్నాడు: "కేరాఫ్ సూర్యా" పై ఆసక్తిగా ఉన్న హీరో

    సందీప్ కిషన్ "కేరాఫ్ సూర్య" సినిమా టైటిల్ని రిలీజ్ చేసిన తమిళ స్తార్ సూర్యానే ఆడియో ఫంక్షన్ కి కూడా ముఖ్య అతిథి గా వస్తున్నాడట. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    |

    తెలుగు తమిళ భాషల్లో నా పేరు శివ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుశీంతిరన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. సినిమా టైటిల్ గా కేరాఫ్ సూర్య అని పెట్టారు అంతేకాదు ఈ టైటిల్ లోగో కోలీవుడ్ సూపర్ హీరో సూర్యతో రిలీజ్ చేయించడం విశేషం. కెరియర్ లో మొదటిసారి తెలుగు తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సుశీంతిరన్ సందీప్ కిషన్ కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ మూవీలో మెహ్రీన్ కథానాయిక. సుశీంద్రన్ దర్శకుడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Sundeep

    ఈ సినిమా ఆడియో ఈవెంట్ వచ్చే వారం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు కూడా ముఖ్య అతిథిగా తమిళ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నారని టాక్. అతిత్వరలో చిత్ర ట్రైలర్ విడుదల చేసి ఆ వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్‌ నటిస్తున్నాడు. సందీప్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని, మధ్య తరగతి యువకుడిగా, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలిపారు.

    వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత ఏ సినిమా కూడా సందీప్ కి హిట్ ఇవ్వలేక పోయింది. ఇక తాజాగా సందీప్ 'నక్షత్రం'సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదురు చూసింది. ఇక ఇప్పుడు సందీప్ ఈ సినిమాతో అయినా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ఇరు వర్గాల వారికి నచ్చేలా ఉంటుందని ఈ చిత్ర బృందం తెలిపింది.

    English summary
    Suria to Attend Audio Function, "C/O Surya" starring Sundeep Kishan and Mehreen Pirzada
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X