Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూర్య కోసం సూర్యానే వస్తున్నాడు: "కేరాఫ్ సూర్యా" పై ఆసక్తిగా ఉన్న హీరో
సందీప్ కిషన్ "కేరాఫ్ సూర్య" సినిమా టైటిల్‌ని రిలీజ్ చేసిన తమిళ స్తార్ సూర్యానే ఆడియో ఫంక్షన్ కి కూడా ముఖ్య అతిథి గా వస్తున్నాడట. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు తమిళ భాషల్లో నా పేరు శివ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుశీంతిరన్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు సందీప్ కిషన్. సినిమా టైటిల్ గా కేరాఫ్ సూర్య అని పెట్టారు అంతేకాదు ఈ టైటిల్ లోగో కోలీవుడ్ సూపర్ హీరో సూర్యతో రిలీజ్ చేయించడం విశేషం. కెరియర్ లో మొదటిసారి తెలుగు తమిళ భాషల్లో సినిమా చేస్తున్న సుశీంతిరన్ సందీప్ కిషన్ కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ మూవీలో మెహ్రీన్ కథానాయిక. సుశీంద్రన్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా ఆడియో ఈవెంట్ వచ్చే వారం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు కూడా ముఖ్య అతిథిగా తమిళ్ స్టార్ హీరో సూర్య హాజరుకానున్నారని టాక్. అతిత్వరలో చిత్ర ట్రైలర్ విడుదల చేసి ఆ వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో కామిరెడ్డి సూర్య పాత్రలో సందీప్ నటిస్తున్నాడు. సందీప్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని, మధ్య తరగతి యువకుడిగా, యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలిపారు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత ఏ సినిమా కూడా సందీప్ కి హిట్ ఇవ్వలేక పోయింది. ఇక తాజాగా సందీప్ 'నక్షత్రం'సినిమా చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదురు చూసింది. ఇక ఇప్పుడు సందీప్ ఈ సినిమాతో అయినా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా ఇరు వర్గాల వారికి నచ్చేలా ఉంటుందని ఈ చిత్ర బృందం తెలిపింది.