సూర్య విశ్వరూపం.. 24 పాత్రలు, గెటప్స్‌తో వీడియో..
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని విలక్షణమైన నటుల్లో సూర్య ఒకరు. సినిమాలోని తన పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తాడని ఆయనకు పేరుంది. గజని, 24, సింగం, శివపుత్రుడు, వీడొక్కడే, గ్యాంగ్ లాంటి చిత్రాల్లో ఆయన పాత్రలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. తాజాగా ఓ అభిమాని సూర్య గురించి అద్బుతమైన వీడియోను రూపొందించారు. ఇప్పటివరకు ఆయన వేసిన 24 క్యారెక్టర్లను ఆ వీడియోలో పొందుపరిచారు.

ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. సూర్య మీకు 24 క్యారెక్టర్లతో కూడిన వీడియో నచ్చుతుందని అనుకొంటా. ఈ వీడియోను చేయాలంటే నాకు వారం రోజులు పట్టింది. మీకు నచ్చితే కామెంట్ చేయాలని వీడియో రూపకర్త ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











