Don't Miss!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సూర్య సినిమా అంతా స్టార్ల మయం.. విలన్‌గా హీరో, 10 దేశాల్లో భారీగా!
Recommended Video
తమిళ తెలుగు భాషల్లో సూర్యకు మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన చిత్రాలతో సూర్య ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. సూర్య మరో మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. వీడోక్కడే, బ్రదర్స్, రంగం వంటి విభిన్న చిత్రాల దర్శకుడు కెవి ఆనంద్ దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య నటిస్తున్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ లాల్, బోమన్ ఇరానీ వంటి నటులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో ప్రముఖ హీరో ఆర్య జాయిన్ అయ్యాడు.
మూడవ చిత్రం
కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించడం ఇది మూడవసారి. వీడోక్కడే, బ్రదర్స్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చినవే కావడం విశేషం. కెవి ఆనంద్ చిత్రాలు స్టైలిష్ గా సాగుతూ ఊహించని మలుపులతో ఉంటాయి.
విలన్ పాత్రలో హీరో
ఈ చిత్రంలోప్రముఖ హీరో ఆర్య విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్య తాజాగా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆర్యతో పాటు మోహన్ లాల్, బోమన్ ఇరానీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్
2.0 చిత్ర నిర్మాణ సంస్థ సూర్య, కెవి ఆనంద్ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు.
10 దేశాల్లో
ఈ చిత్రం దాదాపు 10 దేశాల్లో చిత్రీకరణ జరుపోనుందంటే ఎంత భారీ బడ్జెట్ లో రూపొందుతుందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్, బ్రెజిల్, లండన్, హైదరాబాద్, న్యూ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది.