అసురన్ దర్శకుడితో సూర్య.. ఈసారైనా కలిసొచ్చేనా..?

అసురన్ లాంటి ఓ సామాజిక చిత్రాన్ని తెరకెక్కించి కమర్షియల్ హిట్ కొట్టాడు దర్శకుడు వెట్రిమారన్. ఈ చిత్రంలో నటించిన ధనుష్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. సహజ సిద్దమైన కథ, కథనాలతో తెరకెక్కించిన అసురన్.. తమిళ నాట పెను సంచనలం సృష్టించింది. ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలాంటి ఈ దర్శకుడి తదుపరి చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

గత కొన్నేళ్లుగా హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న టాలెంటెడ్ యాక్టర్ సూర్య.. తమిళ ఆడియెన్స్‌కు కూడా దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్ని విభిన్న ప్రాజెక్ట్‌లు చేసినా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఈ ఏడాదిలోనే ఎన్‌జీకే, బందోబస్త్ అంటూ పలకరించి బొక్క బోర్లా పడ్డాడు. ఆ రెండు చిత్రాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలైనా ఆశించిన సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయాడు.

Suriya 40th Project With Vetrimaran

సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ఆకాశం నీ హద్దురా అనే ఓ చిత్రాన్ని చేస్తుండగా.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. అది కూడా వెట్రి మారన్‌తో. అసురన్‌తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిన వెట్రిమారన్‌తో సూర్య తన 40వ చిత్రాన్ని చేయబోతోన్నాడు. ఈ చిత్రాన్ని కళైపులి ఎస్ థాను నిర్మించనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మిగతా సమాచారం త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X