ఆకాశం నీ హద్దురా.. ఈసారైన సూర్య హిట్ కొడతాడా?
టాలెంట్ ఉన్నా.. కాలం కలిసి రాకపోతే ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రస్తుతం హీరో సూర్య పరిస్థితి అలానే ఉంది. ఓ వైపు భార్య జ్యోతిక, మరో వైపు తమ్ముడు కార్తీ విజయాలతో దూసుకుపోతుంటే సూర్య మాత్రం వెనకబడుతూనే ఉన్నాడు. తీసిన ప్రతీ సినిమా బెడిసికొడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన తదుపరి సినిమాకు సంబంధించిన మూవీ అప్‌డేట్‌ను ప్రకటించేశాడు.
వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో.. తెలుగు మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. సూర్య సినిమాలు ఎప్పుడు వస్తున్నాయ్.. ఎప్పుడు వెళ్తున్నాయ్.. అన్న విషయం ఎవ్వరికీ తెలీకుండా పోతోంది. చివరగా వచ్చిన బందోబస్త్ చిత్రం సైతం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

సూర్య తమ్ముడైన కార్తీ ఇటీవలె ఖైదీ సినిమాతో భారీ హిట్టు కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక సూర్య రావడమే తరువాయి. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య చేయబోయే కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఒకేసారి టైటిల్‌ను రివీల్ చేశారు. ఆకాశం నీ హద్దురా.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో సూర్య లుక్ ఆకట్టుకునే విధంగానే ఉంది. మరి ఈ చిత్రమైన సూర్యకు విజయాన్ని చేకూరుస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











