పవర్‌ఫుల్ మూవీ సీక్వెల్‌లో సూర్య.. తమ్ముడి కార్తీతో కలిసి మల్టీ స్టారర్

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరికి వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ అయితే ఉంది. ఇక అందులో సూర్య బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూర్య ఒక విధంగా తమిళంలో ఎలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నాడో తెలుగులో కూడా అదే తరహాలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అతని బాటలోనే వచ్చిన తమ్ముడు కార్తీ కూడా చాలా తొందరగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒక విధంగా అతనికి తమిళ భాషలో కంటే కూడా తెలుగులోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది.

అయితే గత కొంత కాలంగా వీరి సినిమాలు తెలుగులో అయితే పెద్దగా సక్సెస్ అవడం లేదు. ఒక విధంగా కార్తీ సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడికి కాస్త లాభాలను అందిస్తున్నాయి. కానీ సూర్య చిత్రాలు మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాయి. అతను చివరగా చేసిన సింగం మాత్రమే తెలుగులో భారీ స్థాయిలో సక్సెస్ అందుకోగలిగింది. ఇక సూర్య తమ్ముడు కార్తీ వరుసగా తమిళ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక అతని కెరీర్లో ఖైదీ సినిమా ఒక్కటే తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ప్రస్తుతం ఇద్దరు అన్నదమ్ములు కూడా విభిన్నమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Suriya and karthi brothers planing on multi starrer project with powerful sequel

తప్పకుండా తెలుగులో కూడా తదుపరి సినిమాలతో సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నారు. అయితే వీరిద్దరి కలయికలో మల్టీస్టారర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కాలంలో తమిళ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు కూడా వీరితో మల్టీస్టారర్ చేయబోతున్నట్లు తమిళ్ చిత్ర పరిశ్రమలో టాక్ అయితే వచ్చింది. కానీ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి సూర్య అనుకున్నంతగా సంతృప్తి పొందలేక పోయారు అని అందుకే ఆ సినిమా పట్టాలెక్కలేదు అని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సారి మాత్రం సూర్య ఒక పవర్ ఫుల్ సినిమా సీక్వెల్లో తమ్ముడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కార్తి ఖైదీ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. యువ, ప్రముఖ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా ఖైదీ 2 తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే సూర్య ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

అయితే ఏదో అతిథి పాత్రలో కాకుండా సూర్య కూడా సినిమా కథలో ఎక్కువ సేపు ఉండే విధంగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దర్శకుడి పై నమ్మకం ఉండటంతో సూర్య పెద్దగా అనుమానాలు లేకుండా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ తో పోస్టర్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. మరోవైపు హరి దర్శకత్వంలో కూడా సూర్య ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. కార్తీ కూడా ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X