‘చిన బాబు’ ఆడియో వేడుకకు చీఫ్ గెస్టుగా వస్తున్న హీరో సూర్య

By Bojja Kumar

కార్తీ నటించిన "చినబాబు" సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చెయ్యబోతున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు కార్తి సోదరుడు, సౌతిండియా స్టార్ సూర్య చీఫ్ గెస్టుగా హాజరవ్వుబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Suriya as chief guest for Chinna Babu’s audio

ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన "చినబాబు" టీజర్ కు మంచి స్పందన లభించింది.

నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.

నటీనటులు:
కార్తీ, సయేష, ప్రియా భవాని శంకర్, సత్య రాజ్, భానుప్రియ, సూరి, శంకర్, ఆర్థన బిను

సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాతలు: సూర్య, మిరియాల రవీందర్ రెడ్డి
బ్యానర్స్: 2డి ఎంటర్టైన్మెంట్స్, ద్వారకా క్రియేషన్స్
సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
సంగీతం: డి.ఇమాన్
కెమెరామెన్: వేల్ రాజ్
ఎడిటింగ్: రుబన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X