జైల్లో పెట్టిస్తా, అక్కడే అంతు చూస్తానని వార్నింగ్.. వనితాపై మరో కేసు.. మూడో పెళ్లితో ముప్పుతిప్పలు
తమిళ నటి వనితా విజయ్ కుమార్‌కు మూడో పెళ్లి కంటి నిండ నిద్ర లేకుండా చేస్తున్నది. ఏ ముహుర్తాన పెళ్లి ప్రకటన చేశారో అప్పటి నుంచి ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కరువైనట్టు కనిపిప్తున్నది. పీటర్ పాల్‌తో మూడో పెళ్లి తర్వాత పలువురు నటీనటులు, నిర్మాతలు వనితా విజయ్ కుమార్‌పై విమర్శలు, ఆరోపణలు చేయడం మీడియాను కుదిపేశాయి. ఇటీవల తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ యూట్యూబర్ సూర్యాదేవిపై వనితా విజయ్ కుమార్ పోరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ క్రమంలో వనితపై సూర్యాదేవి కేసు నమోదు చేయడం ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

పీటర్ పాల్‌తో పెళ్లి తర్వాత
పీటర్ పాల్‌తో మూడో పెళ్లి తర్వాత వనితా విజయ్ కుమార్‌ను టార్గెట్ చేసుకొంటూ వీడియో రూపొందించి యూట్యూబ్‌లో సూర్యాదేవి పోస్టులు చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా సూర్యాదేవి వ్యవహరిస్తున్నారు. ఆమె అక్రమ సంబంధాలు బయటపెడుతాం. ఆమె డ్రగ్ దందా సాక్ష్యాలతో నిరూపిస్తాం అని వనితా విజయ్ కుమార్ పోరూర్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

సూర్యాదేవిపై ఆరోపణలు
పోరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత వనితా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సూర్యాదేవి చీప్ పబ్లిసిటీ కోసం, యూట్యూబ్‌లో టీఆర్పీ కోసం నాపై అసభ్యంగా వీడియోలు చేసి ఆన్‌లైన్ ప్రచారం చేస్తున్నారు. ఆమెకు చెన్నైలో మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. అందుకే మేము పోలీసులకు ఫిర్యాదు చేశాం అని వనితా విజయ్ కుమార్, ఆమె లాయర్ తెలిపారు.

వనిత దిగజారుడు వ్యాఖ్యలు
వనితా విజయ్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత సూర్యాదేవీ యూట్యూబ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై అసభ్య, అశ్లీల పదజాలంతో దూషించారు. ఆమె వ్యవహరించిన తీరును, మాట్లాడిన భాషను బట్టి వనిత ఎంత దిగజారిందనే విషయం అర్ధమవుతున్నది. సూర్యాదేవికి తోడుగా నిర్మాత రవిందర్ కూడా జత కలిసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పోలీసులకు సూర్యాదేవి ఫిర్యాదు
వనితా విజయ్ కుమార్ ప్రెస్ మీట్ తర్వాత సూర్యాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారు. నాకు గంజాయి, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం పోరూర్‌లోని ఎస్ఆర్‌ఎంసీ పోలీసులకు వీడియోలను, ఆడియో క్లిప్స్‌ను అందజేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
Recommended Video

జైలులో పెట్టిస్తా.. నేను జైలుకు వస్తా
ఇక వనితా విజయ్ కుమార్‌పై సూర్యాదేవి యూట్యూబ్‌లో విరుచుకుపడ్డారు. యూట్యూబ్‌లో నిన్ను వేధించడం ఆపను. నా వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడుస్తాను. ఈ విషయంలో నిన్ను జైలుకు పంపుతాను. అవసరమైతే నేను జైలుకు వస్తాను. ఎవరు ఏందో జైలులోనే చూసుకొందాం అని వనితా విజయ్ కుమార్‌పై సూర్యాదేవి సవాల్ విసిరారు. దీంతో ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందనే ఆసక్తి నెటిజన్లలో మొదలైంది.


Click it and Unblock the Notifications











