ఆ దర్శకుడితో ఐదోసారి కమిటైన సూర్య!

తమిళ హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో ఇప్పటి వరకు 4 సినిమాలు వచ్చాయి. అందులో 3 సినిమాలు సింగం సిరీస్ చిత్రాలు. తొలిసారి వీరి కాంబినేషన్లో 'వేల్' అనే చిత్రం రాగా... చివరగా సింగం-3 సినిమా చేశారు. సింగం ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఘన విజయం సాధించాయి. అయితే సింగం-3 మాత్రం నిరాశ పరిచింది.

కాగా... సూర్య-హరి మరోసారి కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి వీరి కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. అయితే ఇది సింగం-4 మాత్రం కాదట.

Suriya and director Hari going to work together again

ఈ సారి పూర్తిగా భిన్నమైన కాన్సెప్టుతో హరి ఓ కథ తయారు చేసుకున్నాడని, సూర్యకు నచ్చడంతో చేయడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు.

ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్.జి.కె' సినిమా చేస్తున్నారు. అయితే పలు కారణాలతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో టైటిల్ ఖరారు కాని మరో సినిమా చేస్తూ సూర్య బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X