జ్యోతిక అలాంటి త్యాగం..అందుకే ముంబైకి.. ఫ్యామిలీ విభేదాలపై సూర్య క్లారిటీ!
తమిళనాడు సూపర్ స్టార్ సూర్య నటించిన కంగువా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన ఫ్యామిలీలో విభేదాలు నెలకొంటున్నాయని వస్తున్న రూమర్లకు అసలైన క్లారిటీ ఇచ్చారు. సూర్య చెప్పిన విషయాల్లోకి వెళితే..
గత 6 నెలలుగా సూర్య, కార్తీ కుటుంబాల్లో విభేదాలు నెలకొన్నాయి. అందుకే సూర్య తన కుటుంబం నుంచి బయటకు వచ్చారు. వారి కుటుంబంలో సమస్యలు తలెత్తడంతో తప్పని పరిస్థితిలో జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయ్యారు అనే రూమర్లు భారీగా మీడియాలో వెలుగు చూశాయి. అయితే వాటి గురించి సూర్య గానీ, జ్యోతిక గానీ, కార్తీ గానీ మాట్లాడటానికి నిరాకరించారు. కంగువా సినిమా ప్రమోషన్‌లో రూమర్లపై క్లారిటీ అందించారు.

జ్యోతిక వెబ్ సిరీస్‌లో నటించడం కోసం మీ ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యారా? అని అడిగిన ప్రశ్నకు.. 17 ఏళ్ల వయసులో ఆమె చెన్నైకి వచ్చింది. దాదాపు 27 సంవత్సరాలుగా చెన్నైలోని ఉండిపోయింది. నాతో పెళ్లి తర్వాత ఆమె నా కుటుంబంతో మమేకమైంది. అలా తన కెరీర్‌ను త్యాగం చేసింది. తన బంధువులు, స్నేహితులకు దూరమైంది. ఆమె ముంబై జీవితానికి దూరంగా ఉంటూ వచ్చింది. మగవాడు ఏం కోరుకొంటాడో.. మహిళలకు అదే కోరిక ఉంటుంది. ఆ విషయాన్ని నేను ఆలస్యంగా గ్రహించాను. ముంబైలో ఉండటం ఆమెకు ఇష్టమని తెలుసుకొని నాతోపాటు అందరం అక్కడికి షిఫ్ట్ అయ్యాం అని సూర్య చెప్పారు.
ప్రతీ ఒక్కరు కోరుకొనే విధంగానే ఫ్రెండ్స్ ఉండాలి, కెరీర్ కొనసాగించాలనే విషయాన్ని నేను గ్రహించాను. ఆమె జిమ్‌కు వెళ్లేందుకు సమయం ఉండాలి. ఫిట్‌నెస్ కూడా కావాలి. ఆమె తన తల్లిదండ్రులతో గడపాలి. తనకు నచ్చిన విధంగా గడపాలని కోరుకొన్నాను. ఎప్పుడూ నా కోసమే అనే ఫీలింగ్‌కు దూరంగా ఉండాలనుకొన్నాను. అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యాం అని సూర్య తెలిపారు.

ముంబైకి రావడం వల్ల పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ దొరకుతుంది. పిల్లలు తమకు తోచిన విధంగా స్టడీస్‌ను ఎంచుకొనే అవకాశాలు ఉంటాయి. దేవుడి ఆశీస్పుల వల్ల నా పిల్లలు బాగా చదువుకొంటున్నారు. అందుకే ముంబై రావాలని అనుకొన్న తర్వాత మేము ఇక్కడికి వచ్చాం. నేను చెన్నై ముంబైకి తీరుగుతున్నాను అని సూర్య చెప్పారు. నేను చెన్నై, ముంబై ఉంటూ నా కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను అని అన్నారు.
సూర్య కెరీర్ విషయానికి వస్తే.. 2021 సంవత్సరంలో జై భీమ్ మూవీలో నటించిన తర్వాత.. ఆయన నటించిన ఈటీ మూవీ రిలీజైంది. ఆ తర్వాత విక్రమ్, రాకేట్రి, సర్ఫీరా సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. అక్షయ్ కుమార్ నటించిన సర్పీరా సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కంగువా సినిమా నవంబర్ 14వ తేదీన రిలీజ్ రెడీ అవుతున్నది.


Click it and Unblock the Notifications











