కెబిసి తమిళ వర్షన్ యాంకర్‌గా హీరో సూర్య!
హీందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి(కెబిసి) కార్య్రకమానికి ఎంత పాపులరిటీ వచ్చిందో కొత్తగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లు ఈ కార్య్రకమంలో యాంకర్లుగా దర్శనం ఇచ్చి ఆ షో టీఆర్‌పీ రేటింగులను ఓ రేంజ్ కి తీసుకెళ్లారు. తాజాగా దక్షిణాదిన కూడా ఈ కార్య్రకమాన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాపులర్ సినీ హీరోలయితేనే ఈ కార్య్రకమం క్లిక్ అవుతుందని భావిస్తున్న నిర్వాహకులు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను తమిళ వర్షన్ కోసం ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెన్నయ్ సినీ వర్గాల సమాచారం. అదే జరిగితే అమితాబ్ మాదిరి సూర్య కూడా తమిళ వర్షన్ లో దర్శనం ఇవ్వనున్నాడు.
ఇక మళయాళ వర్షన్ కు మమ్ముట్టి, మోహన్ లాల్ పేర్లు వినిపిస్తున్నాయి. కన్నడలోనూ ఈ కార్య్రకమానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు ఊసు మాత్రం వినిపించడం లేదు. ఒక వేళ తెలుగులో ప్లాన్ చేస్తే ఏ హీరోను ఎంపిక చేస్తారో? చూడాలి.


Click it and Unblock the Notifications











