సూర్య, జ్యోతిక‌ మూవీపై పైరసీ పంజా, గంటలోపే పొన్‌మగల్ వందాల్ ఆన్‌లైన్‌లో లీక్

లాక్‌డౌన్‌లో పలు వివాదాలు, విమర్శల మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన పొన్‌మగల్ వందాల్ చిత్రానికి ఎదురు దెబ్బ తగిలింది. జ్యోతిక నటించిన ఈ చిత్రం మే 29న ఓటీటీ ఫ్లాట్‌ఫాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాను పైరసీ రక్కసి వదల్లేదు. పొన్‌మగల్ వందాల్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో లీక్ కావడం సూర్య దంపతులకు షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

లాక్‌డౌన్‌తో రిలీజ్‌ వాయిదా

లాక్‌డౌన్‌తో రిలీజ్‌ వాయిదా

పొన్‌మగల్ వందాల్ చిత్రాన్ని హీరో సూర్య నిర్మాతగా మారి రూపొందించారు. తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వాస్తవానికి మార్చి 27న రిలీజ్ కావాల్సింది. అయితే నావల్ కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా వాయిదా పడింది. లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో సినిమా రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించాడు. నిర్మాతగా తను అప్పులు పేరుకుపోతున్నాయని, అందుచేత నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నానని చెప్పగానే థియేటర్ల యాజమాన్యాలు మండిపడ్డాయి.

ఆర్థిక ఇబ్బందులతో సూర్య

ఆర్థిక ఇబ్బందులతో సూర్య

తమతో జరిగిన ఒప్పందం ప్రకారం పొన్‌మగల్ వందాల్ చిత్రం నేరుగా థియేటర్లలో చేయాలని, అమెజాన్‌లో రిలీజ్ చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. అయితే సూర్య నిర్మాతగా తన ప్రయోజనాలను, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై విడుదల చేశారు. అయితే మే 29 అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలో విడుదల చేశారు. రిలీజైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడటంతో సూర్య, జ్యోతికకు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంటర్నెట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొనేందుకు, వీక్షించేందుకు అవకాశం కలుగడంతో సినిమా ప్రయోజనాలు దెబ్బ తింటాయనే ఆవేదనను చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది.

హెచ్‌డీ క్వాలిటీ కాపీ

హెచ్‌డీ క్వాలిటీ కాపీ

అంతకు ముందు మే 28 రాత్రి తమిళ సినీ ప్రముఖులకు ఓటీటీ ద్వారా ప్రత్యేక ప్రదర్శన వేశారు. దాంతో పైరసీదారులు ఎలాగోలా సర్వశక్తులు ఉపయోగించి హెచ్‌డీ క్వాలిటీ చిత్రాన్ని రిలీజ్ అవ్వగానే ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దాంతో సినిమా యూనిట్ అవాక్కవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాకు సినీ ప్రముఖులు, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది.

రాధిక శరత్ కుమార్ ట్వీట్

రాధిక శరత్ కుమార్ ట్వీట్

పొన్‌మగల్ వందాల్ చిత్రం గురించి రాధిక శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. స్పెషల్ ప్రీమియర్ షో చూశాను. చాలా బాగుంది. కథ చెప్పిన తీరు అద్బుతంగా ఉంది. సామాజిక అంశంతో వచ్చిన సినిమా కంటెంట్ బలంగా ఉంది. సూర్య, జ్యోతిక కంగ్రాట్స్, జ్యోతిక ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది అని రాధిక తన అభిప్రాయాన్ని చెప్పారు.

పొన్‌మగల్ వందాల్ చిత్రంపై దర్శకుడు విగ్నేష్ శివన్ తన రివ్యూను ట్వీట్ చేశారు. జ్యోతిక పెర్ఫార్మెన్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. జ్యోతిక మేడమ్ ఈ సినిమాకు ఛాంపియన్‌గా నిలిచింది. జేజే ఫెడ్రిక్ డైరెక్షన్ బాగుంది. సూర్య సార్ నుంచి మరో మంచి సినిమా వచ్చింది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

Amazon Prime : Seven Movies To Release Directly On Amazon Prime Video
విఘ్నేష్ శివన్ ట్వీట్

విఘ్నేష్ శివన్ ట్వీట్

పొన్‌మగల్ వందాల్ చిత్రంపై దర్శకుడు విఘ్నేష్ శివన్ తన రివ్యూను ట్వీట్ చేశారు. జ్యోతిక పెర్ఫార్మెన్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. జ్యోతిక మేడమ్ ఈ సినిమాకు ఛాంపియన్‌గా నిలిచింది. జేజే ఫెడ్రిక్ డైరెక్షన్ బాగుంది. సూర్య సార్ నుంచి మరో మంచి సినిమా వచ్చింది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X