Kanguva: సూర్య సినిమాకు ఊహించని టైటిల్.. పది భాషల్లో సంచలనంగా!
పేరుకు కోలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకోవడంతో పాటు.. దేశ వ్యాప్తంగానూ ఉత్తమ నటుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు సూర్య. సుదీర్ఘ కాలంగా విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. దీంతో స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు.
ఈ ఉత్సాహంతోనే సరికొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూర్య.. మాస్ డైరెక్టర్‌గా పేరొందిన శివతో సినిమాను చేస్తున్నాడు.

సూర్య 42వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ చారిత్రక నేపథ్యంతో వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను చాలా వరకూ పూర్తి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. దీనికి 'కంగువ' అనే పేరును ఖరారు చేశారు. దీనికి 'అగ్ని శక్తి ఉన్న యోధుడు, శక్తివంతమైన పరాక్రమవంతుడు' అని అర్థం. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రంలో సూర్య పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక, టైటిల్‌ను రివీల్ చేసేందుకు చిత్ర యూనిట్ తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో సూర్య ముఖాన్ని అయితే చూపించలేదు కానీ.. అతడి క్యారెక్టర్ చూపించే పరాక్రమాన్ని, వీరత్వాన్ని హైలైట్ చేశారు. అలాగే, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాయి. దీంతో ఈ వీడియోకు అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ఏకంగా పది భాషల్లో రూపొందిస్తున్నారు. అన్నింటికీ 'కంగువ' అనే టైటిల్‌నే ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కంగువ' మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో యోగి బాబు కీలక పాత్రను చేస్తున్నాడు. దీన్ని 2024 ప్రారంభంలో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











