సూర్య గొప్ప మనసు: అభిమాని కోరిక తీర్చి... ఖర్చు భరిస్తానని హామీ!
సౌతిండియా స్టార్ హీరోల్లో ఒకరైన సూర్యకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేవలం నటన మాత్రమే కాదు, సేవా గుణం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ... ఆయన్ను ఇంత గొప్పస్థాయికి తీసుకొచ్చిందని చెబుతుంటారు. తాజాగా మరోసారి సూర్య తన పెద్ద మనసు చాటుకున్నారు.
జబ్బుతో బాధ పడుతున్న కెవి దినేష్ అనే బాలుడు తన అభిమాన హీరోను కలవాలని ఆశపడటంతో ఈ విషయం ఫ్యాన్స్ అసోసియేషన్స్ ద్వారా తెలుసుకున్న సూర్య అతడిని తన ఇంటికి పిలిపించుకుని కలిశారు. ఈ సందర్భంగా దినేష్‌కు సూర్య పలు కానుకలు అందించారు.

ఆనందంతో పరవశించిన బాలుడు
తెరపై చూసే తన ఆరాధ్య నటుడు కళ్ల ముందు కనిపించడంతో ఆ బాలుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సూర్య కొంతసేపు అతడితో ముచ్చటించి, సెల్ఫీలు దిగి మరింత ఉత్సాహ పరిచారు.

వైద్య ఖర్చులు భరిస్తానని హామీ
ఈ సందర్భంగా సూర్య.... దినేష్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ హీరోను పొగుడుతూ పోస్టులు పెట్టారు.

పేయింటింగ్ బహుమతిగా
దినేష్ చక్కగా బొమ్మలు కూడా వేస్తాడు. ఈ సందర్భంగా తాను వేసిన పేయింటింగును వెంట తీసుకొచ్చిన సూర్య తండ్రి శివ కుమార్‌కు బహూకరించాడు.

సూర్య సినిమాలు
సూర్య ప్రస్తుతం కెవి ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సూర్య కెరీర్లో ఇది 37వ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మూవీలో సూర్య డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నారు. ఇందులో మోహన్ లాల్, ఆర్య, సాయేషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











