హీరో కోసం రాజమండ్రిలో 500 మంది.. ఆంధ్రానా లేక తమిళనాడా!
Recommended Video

విలక్షణ నటనతో మెప్పించడం హీరో సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. తమిళంలోనే కాదు తెలుగులో కూడా సూర్యకు భారీగా అభిమానులు ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే థియేటర్స్ లో విజిల్స్ వేయించే విధంగా సూర్య నటించే చిత్రాలు ఉంటాయి. గజినీ చిత్రంతో దక్కిన అభిమానం అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజగా రాజమండ్రిలో అభిమానుల తాకిడికి సూర్య షాక్ అయ్యాడు.

రాజమండ్రిలో
సూర్య ప్రస్తుతం ఎన్ జి కె చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుగుపుకుంటోంది. అవకాశం ఉంటె తన చిత్రాలని ఆంధ్రప్రదేశ్ లో కూడా చిత్రీకరణ జరపాలని సూర్య భావిస్తుంటారు.

క్రేజీ కాంబినేషన్
ఎన్ జి కె చిత్రంలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండడం విశేషం. ప్రియా భవాని శంకర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి.

అభిమానుల తాకిడి
ఎన్ జి కె చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుందని తెలియడంతో అభిమానులు షూటింగ్ లొకేషన్ కు పోటెత్తారు. సిబ్బంది వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. దాదాపు 500 మంది అభిమానులు సూర్య ఉంటున్న క్యారవాన్ ని చుట్టుముట్టారు. సూర్య దిగి వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.

ఆంధ్రానేనా
తాము షూటింగ్ జరుపుతున్నది ఆంధ్రాలోనా లేక తమిళనాడులోనా అని చిత్ర యూనిట్ షాక్ కి గురైందట. సూర్యకు ఆంధ్రాలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











