Don't Miss!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సూర్య సెవెన్త్ సెన్స్ లో రవితేజ చెల్లెలు..!?
సూర్య, శృతి హాసన్ జంట గా ఎ.ఆర్. మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'శంభో శివ శంభో చిత్రంలో రవితేజకు చెల్లెలి పాత్రలో నటించి, అందరి ప్రశంసలు పొందిన నటి అభినయ. అభినయ తాజాగా 'సెవెన్త్ సెన్స్" చిత్రంలో నటిస్తుందని తెలిసింది. ఈ చిత్రంలో సూర్య సరసన అభినయ నటిస్తుందని సమాచారం. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా మాత్రం శృతీహాసన్ నటిస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియకుండా, సినిమా విడుదల వరకు కూడా పైలెంట్ గా ఉంచాలనుకుని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నప్పటికి కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా ఈ సమాచారం అందింది.
కాగా సెవెన్త్ సెన్స్ ఆడియోను ఈ నెల 23 న విడుదల చేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం మీద భారీ గా నే అంచనాలు ఉన్నాయి. టైం మెషిన్ ఆధారం గా నిర్మించిన ఈ కథ చాల కొత్త గా ఉంటుందట. సెవెన్త్ సెన్స్ సినిమా లో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. బౌద్ద సన్యాసి గా , శాస్త్రవేత్త గా, సర్కస్ ఆర్టిస్ట్ గా మూడు పాత్రలు పోషిస్తున్నాడు. ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన టైం మెషిన్ కి ఈ మూడు పాత్రల కి మద్య ఉన్న సంబంధం గురించిన సినిమా ఇది.
సూర్య కెరీర్ లో నే అత్యంత భారీ బడ్జెట్ 84 కోట్లు తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ గా అంచనాలు ఉన్నాయి. ఇటు తెలుగు లో అటు తమిళం లో తనకంటూ మంచి మార్కెట్ ని పెంచుకున్నాడు సూర్య. తెలుగు లో కూడా భారీ గానే అంచనాలు ఉన్నాయి. శ్రుతి హాసన్ కి కూడా సరైన హిట్ ఒక్కటీ లేకపోవడం ఇప్పుడు ఈ సినిమా లో సూర్య లాంటి పెద్ద స్టార్ తో నటించడం తో ఈ సినిమా మీద శృతి కూడా ఆశలు పెట్టుకుంది. దీపావళి కి రిలీజ్ అవడానికి సిద్దపడుతున్న ఈ సినిమా కి సంగీతం హారిస్ జయరాజ్. హారిస్ జయరాజ్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన చాల సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అంచనాలు పెరగడాంకి ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.