తక్కువ స్థాయి విమర్శలను పట్టించుకోవద్దు.. మీరాపై సూర్య సూపర్ కౌంటర్
స్వయం ప్రకటిత సెలెబ్రిటీ, మోడల్ అయిన మీరా మిథున్.. కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతోంది. తమిళ్ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అంతో ఇంతో ఫేమస్ అయిన మీరా.. గత కొన్ని రోజులుగా నానా రచ్చ చేస్తోంది. త్రిష, విజయ్, సూర్య, కోలీవుడ్, నెపోటిజం అంటూ వివాదాలను తెరదీస్తోంది. స్టార్ హీరోలపై మీరా చేసే కామెంట్లకు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హద్దు మీరి చేస్తోన్న మీరా కామెంట్లపై సూర్య పరోక్షంగా కౌంటర్స్ వేశాడు.

త్రిషతో ఆరంభం..
మీరా మిథున్ వార్తల్లో నిలవడం కోసం మొదటగా త్రిషను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. త్రిష స్టైల్, డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అంతా కూడా తనదే అని, తనని చూపే కాపీ కొడుతోందని మీరా ఫైర్ అయింది. ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మీరా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది.

విజయ్, సూర్యలపై..
ఇక నెపోటిజం విషయంలో కోలీవుడ్‌పై తీవ్ర విమర్శలు చేసింది. అందులో భాగంగా విజయ్, సూర్యలను టార్గెట్ చేసింది. తండ్రుల ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చారని, మిగతా వారిని రానివ్వరని ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఈ క్రమంలో మీరాపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం లేదంటూ.. చేతులకు గాజులు తొడుక్కోండి, చీరలు పంపిస్తా కట్టుకోండని విజయ్, సూర్యలను దారుణంగా తిట్టింది.

స్పందించిన సెలెబ్రిటీలు..
మీరా మిథున్ ఆగడాలను కోలీవుడ్ ఖండించింది. కస్తూరీ శంకర్, దర్శకుడు భారతీరాజా వంటి వారు మీరాపై ఫైర్ అయ్యారు. కోలీవుడ్‌లో కేవలం ప్రతిభకు మాత్రమే స్థానం ఉంటుందని, నెపోటిజం అనేది ఉండనే ఉండదని కస్తూరీ చెప్పుకొచ్చింది. నెపోటిజం ద్వారా వచ్చినా కూడా సొంత టాలెంట్ ఉంటేనే స్టార్‌గా ఎదుగుతారని తెలిపింది.
Recommended Video

పరోక్షంగా కౌంటర్..
ఇక తాజాగా సూర్య మీరాపై ఓ సెటైర్ వేశాడు. గతంలో ఎన్నడో చేసిన పోస్ట్‌ను మళ్లీ తీసి.. సెటైర్ వేశాడు. తక్కువ స్థాయి విమర్శలకు మనం స్పందించి మన స్థాయిని తగ్గించుకోవద్దు. మీ విలువైన సమయాన్ని మంచి పనులకు వాడండి.. సమాజ శ్రేయస్సుకోసం పాటు పడండి అని గతంలో చేసిన పోస్ట్‌ను మళ్లీ బయటకు తీశాడు. దాంతో పాటు మరో కామెంట్ కూడా చేశాడు. గొప్ప కార్యక్రమాలకు మీ తెలివిని, సమయాన్ని వాడాలని నా సోదరసోదరిమణులను కోరుకుంటున్నా.. దర్శకుడు తిరుమీకు, భారతీరాజాలకు ధన్యవాదాలు అంటూ పరోక్షంగా స్పందించాడు.


Click it and Unblock the Notifications











