twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేటాడే నరసింహం ఇప్పుడు కమాండో.. క్రేజీగా యాక్షన్ సీన్స్!

    |

    హీరో సూర్య ఎలాంటి పాత్రలోకైనా సరే పరకాయ ప్రవేశం చేస్తాడు. సూర్య నటించలేని పాత్ర అంటూ లేదని ఇప్పటికే అతడు నటించిన చిత్రాల ద్వారా అర్థం అయింది. సింగం సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించినా, 24, 7th సెన్స్ వంటి విభిన్న ప్రయోగాలు చేసినా అది సూర్యకే చెల్లింది. ప్రస్తుతం సూర్య రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ దర్శత్వంలో ఎన్ జి కె చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

    రెండు సూపర్ హిట్స్

    రెండు సూపర్ హిట్స్

    కెవి ఆనంద్, సూర్య కాంబినేషన్ లో ఇప్పటికే వీడోక్కడే, బ్రదర్స్ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కెవి ఆనంద్ సినిమాలు స్టైలిష్ గా ఉంటూ ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. కెవి ఆనంద్ చిత్రాలు ఎక్కువగా మల్టిప్లెక్స్, ఓవర్సీస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే విధంగా ఉంటాయి.

    స్టైలిష్‌గా సూర్య

    స్టైలిష్‌గా సూర్య

    కెవి ఆనంద్, సూర్య కాంబోలో తెరకెక్కే చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన సూర్య లుక్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. దీనితో సూర్య ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. సూర్య పాత్ర గురించి జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.

    పవర్ ఫుల్ కమాండో

    పవర్ ఫుల్ కమాండో

    సూర్య ఈ చిత్రంలో పవర్ ఫుల్ కమాండో పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెవి ఆనంద్ శైలిలో ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    కీలక పాత్రల్లో

    కీలక పాత్రల్లో

    ఈ చిత్రంలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరో ఆర్య, బోమన్ ఇరానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది.

    English summary
    Suriya role in KV Anand film revealed. This is the third movie of Suriya, KV Anand combo
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X