సినిమా అక్కడ సూపర్ హిట్... రూ. 1 కోటి విరాళం అందించిన సూర్య!
Recommended Video

కార్తి, సాయేషా సైగల్, ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం 'కడైకుట్టి సింగం' తమిళనాట మంచి విజయం అందుకుంది. తెలుగులో 'చినబాబు' పేరుతో విడుదలైన ఈ చిత్రం ఆశించిసన స్థాయిలో ఫలితాలు సాధించక పోయినా తమిళనాడులో మాత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రాన్ని కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సొంత బేనర్ '2డి ఎంటర్టెన్మెంట్స్'పై నిర్మించడం విశేషం.
'కడైకుట్టి సింగం' సక్సెస్ మీట్ ఇటీవల చెన్నైలోని ఓ హోటల్‌లో జరిగింది. సినిమా మంచి విజయం సాధించి లాభాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన శక్తివేలన్ సూర్య, కార్తి, పాండిరాజ్, రాజశేఖర్ పాండ్యన్‌కు బంగారు చైన్స్ బహూకరించారు.

ఈ సందర్భంగా నిర్మాత సూర్య మాట్లాడుతూ... అగ్రికల్చర్ రీసెర్చ్, డెవలప్మెంటు కోసం రూ. 1 కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. తన 'అగరం' ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థి .. విద్యార్ధినీలకు సూర్య స్కాలర్ షిప్స్ అందజేస్తోన్న సంగతి తెలిసిందే.
సూర్య ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ప్రకటించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందులోనూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కోసం కావడంతో పలువురు ప్రశంసించారు. 'కడైకుట్టి సింగం' చిత్రంలో కార్తి రైతు పాత్రలో నటించాడు. వ్యవసాయం చేసే రైతు తలెత్తుకుని తిరిగేలా ఈ సినిమా అద్భుతంగా తీశారని, యువతను వ్యవసాయం వైపు నడించేలా, ఒక ఇన్స్‌స్పిరేషన్‌లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











