Jai Bhim మూవీకి మరో అరుదైన గుర్తింపు.. రెండు అవార్డులతో సత్తా చాటిన సూర్య
విలక్షణ నటుడు, తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి మరోసారి అరుదైన గుర్తింపు లభించింది. ఈ చిత్రం బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకోవడమే కాకుండా రెండు అవార్డులను సొంతం చేసుకొన్నది. గత కొద్ది నెలలుగా ఈ సినిమా అవార్డుల పంటను విదేశీ వేదికలపై పండిస్తున్నది. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులను గెలుచుకోవడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.
తాజాగా బోస్టన్ ఫిలిం ఫెస్టివల్‌లో నటి లిజోమొల్ జోస్ ఇండి స్పిరిట్ బెస్ట్ యాక్టర్ అవార్డును, ఎస్ఆర్ కథిర్ సినిమాటోగ్రఫి అవార్డును సొంతం చేసుకొన్నది. దీంతో ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు మరోసారి లభించింది.

బోస్టన్ ఫిలిం ఫెస్టివల్‌లో జై భీమ్ సినిమాకు రెండు అవార్డులు లభించాయి. లిజోమోల్ జోస్, ఎస్ఆర్ కథిర్ సార్‌కు అవార్డులు లభించాయి. థ్యాంక్యూ బోస్టన్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో మా సినిమాకు దక్కిన గౌరవం అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు మరోసారి అంతర్జాతీయ వేదికలపై అవార్డు దక్కడంతో నెటిజన్లు, సినీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ కస్టడీలో అదృశ్యమైన భర్త కోసం భార్య చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో దళితుల కోసం న్యాయపోరాటం చేసిన లాయర్‌గా సర్య అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిది.


Click it and Unblock the Notifications











