twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూర్యను కొడితే లక్ష బహుమతి.. మరో వివాదంలోకి జై భీమ్ మూవీ

    |

    తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన జై భీం చిత్రం విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా పై తాజగా ఓ వివాదం చెలరేగింది.. ఈ క్రమంలో సూర్యను కొడితే లక్ష రూపాయలు ఇస్తామని ఒక సంస్థ ప్రకటించడం సంచనంగా మారింది. వివరాల్లోకి వెళితే

    హాలీవుడ్ రికార్డులు కూడా

    హాలీవుడ్ రికార్డులు కూడా

    తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం 'జై భీమ్'. ఆమెజాన్ ప్రైంలో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమా బాగుందని చెబుతూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ సినిమా తాజాగా హాలీవుడ్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది.

    నెంబర్ 1 గా

    నెంబర్ 1 గా

    ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసి ఇప్పటి వరకూ ఐఎండీబీ మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ 'ది షాషాంక్ రిడంప్షన్'ను వెనక్కు నెట్టింది. జర్నలిస్ట్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా 9.6 రేటింగ్‌ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఫ్రాంక్ డారాబోంట్ 'ది షాశాంక్ రిడెంప్షన్' 9.3 రేటింగ్‌తో రెండవ స్థానంలో ఉండగా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల క్లాసిక్ 'ది గాడ్ ఫాదర్' 9.2 రేటింగ్‌తో మూడవ స్థానంలో నిలిచింది.

    వివాదంలో

    వివాదంలో

    అయితే తాజాగా ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జై భీం సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. అంతే కాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు పీఎంకే నేతలు. జై భీం సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణలు చేస్తున్నారు.

    నష్ట పరిహారం

    నష్ట పరిహారం


    5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కూడా జై భీమ్ హీరో, నిర్మాత అయిన సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది. ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖ కూడా రాశారని అంటున్నారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    ఆమెకి సాయం

    ఆమెకి సాయం


    ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదంలో నటుడు సూర్యకి మద్దుతుగా కొన్ని పార్టీలు, దళిత - గిరిజన సంఘాల సహా అనేక మంది కూడా నిలుస్తున్నారు. ఈ విషయం మీద సూర్య కూడా వామపక్షాలకు లేఖ రాశాడనీ అంటున్నారు. మరో పక్క ఈ ఘటనలో బాధితురాలుగా ఉన్న పార్వతి అమ్మాన్ కు ఇల్లు కట్టిస్తామని లారెన్స్ ప్రకటించగా, ఆమె పేరు మీద రూ. 10 లక్షలు బ్యాంకు లో వేసినట్టు సూర్య వెల్లడించారు.

    English summary
    Suriya's Jai Bhim struck in a controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X