అనారోగ్యంతో హాస్పిటల్‌లో డైరెక్టర్.. ఆగిన సూర్య సినిమా.. రిలీజ్ ఆలస్యం!
Recommended Video

విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం NGK (నంద గోపాలకృష్ణ). ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, 7జీ బృందావన కాలనీ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే దీపావళీకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేనట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ...

దర్శకుడు సెల్వరాఘవన్‌కు అనారోగ్యం
దర్శకుడు సెల్వరాఘవన్ అనారోగ్యానికి గురయ్యాడు. సర్జరీ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరాడు. దాంతో NGK షూటింగ్ ఆగిపోయింది. ఆ చిత్ర విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో చిత్ర యూనిట్ పెద్దగా పెదవి విప్పకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి.

నా గురించి ఆందోళన పడొద్దు
తన ఆరోగ్యంపై మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో సెల్వరాఘవన్ స్పందించాడు. నాకు కొంత ఆరోగ్యపరంగా చిన్న సమస్య వచ్చింది. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లో మళ్లీ షూటింగ్‌కు హాజరవుతాను అని సెల్వరాఘవన్ వివరణ ఇచ్చారు.

త్వరలో షూటింగ్‌కు వస్తాను
అంతేకాకుండా సెల్లరాఘవన్ ట్విట్టర్‌లో కూడా ఓ పోస్టు పెట్టాడు. హాయ్ ఫ్రెండ్స్. ఇది వైద్యపరంగా చిన్న సర్జరీ. నేను బాగున్నాను. త్వరలోనే షూటింగ్ వస్తాను. రెండు, మూడు రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది. నా ఆరోగ్యంపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యుడిని అంటూ సెల్వరాఘవన్ ట్వీట్ చేశారు.

NGK భారీ అంచనాలు
NGK చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్నది. మార్చి 5వ తేదీన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించగా బ్రహ్మండమైన రెస్సాన్స్ వచ్చింది. ఇటీవల రెండో లుక్‌ను కూడా విడుదల చేయడంతో మంచి స్పందన వ్యక్తమైంది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











