క్రేజీగా ఎన్‌జీకే టీజర్.. పోరా, నువ్వు దిగితే మురికి శుభ్రం.. డైనమెట్‌లా పేలిన సాయిపల్లవి!
గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా 'ఖాకి' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్','రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'NGK' (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.

నాపేరు ఎన్‌జీకే.. నంద గోపాలకృష్ణ
"నా పేరు నంద గోపాల కృష్ణ. ప్రజలు నన్ను ఎన్ జి కె అని పిలుస్తారు" అని సూర్య చెప్పే డైలాగ్‌తో మొదలయ్యే టీజర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠ రేపేలా ఉంది. నీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే గ్రామం బాగుపడుతుంది.. రాజకీయాలు నేర్చుకొంటా అయ్యగారు అనే డైలాగ్స్ సినిమా ఎలా ఉంటుందో అనే విషయాన్ని వెల్లడించాయి.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రశ్నార్థకం
రాజకీయాలా అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ప్రశ్నించడం ట్విస్టును తలపించింది. ఉప్పెనై లేవరా అంటూ సాగే పాట ఉద్వేగ భరితంగా ఉంది. టీజర్లలో ఏపీ ముఖ్యమంత్రుల ఫొటోలు చూపించడంతో రాజకీయ ప్రక్షాళన దిశగా ఉంటుందనే భావన టీజర్ కలిగించింది.

డైనెమెట్‌లా పేలిన సాయిపల్లవి డైలాగ్స్
సాయి పల్లవి చెప్పే "గోపాలా.. పోరా నాన్నా నువ్వు దిగితే ఎలాంటి మురికైనా శుభ్రమవుతుంది" అనే డైలాగ్‌తో ఎన్‌జీకె హై ఓల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా అలరించనున్నదనే ఫీలింగ్ కలిగింది. వేచి ఉందాం అనే డైలాగ్‌తో టీజర్ ముగియడం మరింత ఆసక్తిగా ఉంది.
నటీనటులు, సాంకేతిక వర్గం
విలక్షణ నటుడు సూర్యకు జంటగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.
ఈ చిత్రానికి సంగీతం : యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ


Click it and Unblock the Notifications











