»   » 'గాడ్ ఫాధర్' టైప్ కథ అని ముందే చెప్పాసారు, ఏంటో ఆ ధైర్యం?

'గాడ్ ఫాధర్' టైప్ కథ అని ముందే చెప్పాసారు, ఏంటో ఆ ధైర్యం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో కథని ముందే చెప్పటానికి ఆసక్తి చూపించరు. కానీ తమిళ హీరో సూర్య కోసం రెడీ అవుతున్న చిత్రం కథ మాత్రం గాఢ్ ఫాధర్ నుంచి తీసుకుని చేస్తున్నానని ప్రారంభానికి ముందే దర్శకుడు సెల్వరాఘవ్ తెలియచేసారు. ఇప్పుడు తమళనాట ఈ విషయమే అంతటా హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్యాప్ తర్వాత తరువాత నెంజమ్ మరప్పాత్తిళ్లె చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ హీరో సూర్యతో ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ విషయాన్ని హీరో సూర్య ట్విట్టర్‌లో దృవీకరించారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా గాడ్ ఫాదర్ తరహా కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. ఇండియాలో వున్న అత్యుత్తమ నటుల్లో సూర్య ఒకరు. అలాంటి వ్యక్తితో సినిమా చేయబోతుండటం ఆనందంగా వుంది.

గాడ్ ఫాదర్ తరహా చిత్రాలకు సూర్య పర్‌ఫెక్ట్‌గా సరిపోతారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఆల్ పాసినో పాత్రను సూర్య అద్భుతంగా మెప్పించగలడు అని సెల్వరాఘవన్ ట్విట్టర్‌లో తెలిపారు.

ఇక గాఢ్ ఫాదర్ తరహా చిత్రాలు ఇప్పటికే ఇండియన్ తెరపై చాలా చాలా వచ్చాయి. కమల్ హాసన్ క్షత్రియపుత్రుడు నుంచి రామ్ గోపాల్ వర్మ వరసగా తీసే చిత్రాలన్నీ గాఢ్ ఫాధర్ నుంచి పుట్టినవే. అయితే మరి ఈ సారి గాడ్ ఫాధర్ లో ఏ యాంగిల్ చూపబోతున్నారో చూడాలి.

English summary
Selvaraghavan has made a stunning announcement on Twitter. He tweeted, "Super excited to be working with Suriya_offl , one of the finest actors in india & DreamWarriorpic ,a young and energetic team. #Suriya36. [sic]" Responding to his post, the actor tweeted, "Happy join hands with.....!!selvaraghavan DreamWarriorpic prabhu_sr srprakashbabu #Suriya36. [sic]"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu