10000 మందితో 10 కోట్లకుపైగా బడ్జెట్.. కళ్లు చెదిరే వార్ సీక్వెన్స్ షూట్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, కేవీఎన్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా కేఈ జానవేల్ రాజ్, వీ వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న చిత్రం కంగువ. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన ఈ చిత్రాన్ని సుమారుగా 350 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం చిత్రీకరిస్తున్న వార్ సీక్వెన్స్ షూట్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, యుద్ద సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కంగువా సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, బాబీ డియోల్ తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే, కోవై సరళ, ఆనంద్ రాజ్, కేఎస్ రవికుమార్ తదితరులు నటిస్తున్నారు. ఇక చిత్రానికి వెట్రీ పళనిస్వామి సినిమాటోగ్రఫి, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, నిశ్శబ్ద్ యూసఫ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Suriya Shivakumar s kanguva War Sequences shoot with 10000 junior Artist with 10 Crores budget

అయితే కంగువా సినిమాకు కీలకంగా మారే యుద్ద సన్నివేశాలను అత్యంత భారీ ఖర్చుతో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలను సూర్య, బాబీ డియోల్‌పై సుమారుగా 10000 మంది జూనియ్ ఆర్టిస్టులతో వార్ సీక్వెన్స్ నభూతో నభవిష్యత్‌గా చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఇక కంగువా సినిమా కోసం దాదాపు 350 కోట్లకుపైగా బడ్జెట్‌ను కేటాయించారు. అయితే ఈ వార్ సీక్వెన్స్ కోసమే సుమారుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలుస్తున్నది. ఈ సీన్ల కోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా స్టంట్ మాస్టర్లను రప్పించారు. తెర మీద ఈ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చెబుతున్నారు.

Suriya Shivakumar s kanguva War Sequences shoot with 10000 junior Artist with 10 Crores budget

కంగువా సినిమా థీమ్‌కు తగినట్టుగా ఉండే యుద్ధ సన్నివేశాలు ఇండియన్ సినిమా రంగంలోనే అత్యంత వ్యయంతో తీర్చిదిద్దుతున్నట్టు చిత్ర యూనిట్ చెప్పారు. ఈ యుద్ద సన్నివేశాల కోసం భారీగా సెట్స్ వేశారు. ఈ సెట్స్ మరో లోకంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేలా ఉంటాయని చెప్పారు. ఈ చిత్రం 2024 సంవత్సరం చివరి భాగంలో రిలీజ్ అవుతుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X