టాలీవుడ్ అగ్ర దర్శకులతో సూర్య.. ముందు సెట్టయ్యేది ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. గజిని సినిమా అనంతరం చాలా వరకు సూర్య సినిమాలు తెలుగులో కూడా సాలీడ్ వసూళ్లను అందుకుంటూ వచ్చాయి. ఒక విధంగా ఇక్కడి స్టార్ హీరోలతో కూడా పోటీ పడుతూ మరి సూర్య సినిమాలు మంచి వసూళ్లను అందుకునేవి.

అయితే రజనీకాంత్, కమల్ హాసన్ తరహాలోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని సూర్య ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఇంతవరకు సరైన ప్రాజెక్ట్ సెట్టవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడితో కూడా ఆ మధ్య చర్చలు జరిగాయి కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ తో మళ్ళీ ఇటీవల సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

suriya special focus on direct telugu movie discussion with star directors

అలాగే గత రెండు వారాల క్రితం బోయపాటి శ్రీనుతో కూడా చర్చలు జరిగినట్లు టాక్ అయితే వచ్చింది. ఎలాగైనా ఈ గ్యాప్ లోనే డైరెక్ట్ తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేయాలని సూర్య ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక ముందుగా ఎవరితో వర్క్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇక ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే హరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు. మరి తెలుగు దర్శకులతో ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X