Kanguva: సూర్య అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఆరోజే అసలైన వీడియో రిలీజ్

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా.. సౌత్ ఇండియా మొత్తంలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని స్టార్‌గా సత్తా చాటుతోన్నాడు సూర్య. విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్న సూర్య.. ఇప్పుడు పాన్ ఇండియాపై టార్గెట్ పెట్టాడు. ఇందులో భాగంగానే తన 42వ సినిమాగా 'కంగువ'ను చేస్తున్నాడు. హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

సూర్య హీరోగా మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'కంగువ'. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇలా ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్టును చాలా వరకూ పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఇక, ఇప్పుడు గ్లింప్స్ గురించి ప్రకటన చేసింది.

Suriya Starrer Kanguva Movie Glimpse Release on July 23rd

సూర్య నటిస్తున్న 'కంగువ' మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను జూలై 23వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన వదిలింది. అంతేకాదు, ఇందుకోసం ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో కండలు తిరిగిన ఓ భారీ చేతిని వెనుక నుంచి చూపించారు. ఆ హ్యాండ్‌పై వినూత్నమైన డిజైన్‌తో కూడిన గుర్తులు ఉన్నాయి. అలాగే, ఆ చేతిలో ఓ పెద్ద కత్తిని కూడా చూపించారు. దీంతో ఈ గ్లింప్స్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Suriya Starrer Kanguva Movie Glimpse Release on July 23rd

ఇదిలా ఉండగా.. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కంగువ' మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో యోగి బాబు కీలక పాత్రను చేస్తున్నాడు. దీన్ని 2024 ప్రారంభంలో విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X