Kanguva: ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న సూర్య.. అదే జరిగితే ఇద్దరికీ నష్టమే!
పేరుకు తమిళ హీరోనే అయినా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్న హీరోనే సూర్య. ప్రతి సినిమాలోనూ నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటోన్న అతడు.. వరుసగా ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ కెరీర్ బెస్ట్ యాక్టింగ్‌ను చేస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూర్య పాన్ ఇండియాపై ఫోకస్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు 42వ సినిమాగా 'కంగువ'ను చేస్తున్నాడు. హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
సూర్య హీరోగా మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న మూవీనే 'కంగువ'. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇలా ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్టును చాలా వరకూ కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 'కంగువ' మూవీని ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన మరికొద్ది రోజుల్లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ 'కంగువ' మూవీ ఏప్రిల్ 11నే విడుదల అయితే.. దానికంటే ముందు రాబోయే జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లోనే విడుదల కాబోతున్నాయి. అలాంటి వారం గ్యాప్‌లో వచ్చి పోటీ పడితే రెండు చిత్రాలకూ కలెక్షన్లు ఆశించిన రీతిలో వచ్చే ఛాన్స్ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'కంగువ' మూవీలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో యోగి బాబు కీలక పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











