చాలా గ్యాప్‌తో అలా.. సెట్స్‌లో అడుగుపెట్టిన సూర్య
సూర్య హీరోగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కరోనా, లాక్డౌన్ వేడిలోనే ఈ మూవీ ఓటీటీలో వచ్చింది.అయితే ఈ మూవీ క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఆస్కార్ బరిలో నిలబడి భారత్ సత్తా చాటింది. ఆకాశం నీ హద్దురా సినిమాతో సూర్యకు ఇన్నాళ్ల కోరిక నెరవేరింది. వరుసగా ఫ్లాపులతో సతమతమైన సూర్య ఈ మూవీతో తన సత్తాను చాటాడు.
అయితే అదే ఊపులో కొత్త సినిమాలను కూడా ఓకే చేశాడు. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. సూర్యకు కరోనా పాజిటివ్ రావడంతో పరిస్థితులు మారిపోయాయి. కరోనా నుంచి సూర్య ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఈ మేరకు సెట్లో అడుగుపెట్టినట్టు చెప్పేశాడు. కరోనా పాజిటివ్ రావడంతో సూర్య పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న సూర్య ఇప్పుడు సెట్ మీదకు వచ్చేశాడు.

ఇలా చాలా గ్యాప్ తరువాత సెట్స్ మీదకు అడుగుపెట్టడంతో సూర్య హ్యాపీగా ఫీలైనట్టున్నాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఓ స్టిల్‌ను షేర్ చేశాడు. ఇలా సెట్స్‌పైకి మళ్లీ రావడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. పాండ్యరాజ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీకి రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతాన్ని అందించబోతోన్నాడు.


Click it and Unblock the Notifications











