ఆ హీరోయినే కావాలంటున్న సూర్య... రంగంలోకి దర్శకుడు!
తమిళ స్టార్ సూర్య త్వరలో శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అజిత్‌తో ఎక్కువ సినిమాలు తీసే శివ తన వద్ద ఉన్న కథను ఇటీవల సూర్యకు చెప్పి ఒప్పించారట. ప్రస్తుతం చేస్తున్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇందులో హీరోయిన్ ఎవరనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శివ చెప్పిన కథ ప్రకారం ఆ పాత్రను నయనతార చేస్తే బావుంటుందని సూర్య భావిస్తున్నారట. ఈ మేరకు శివ... నయనతారతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.

సూర్య సినిమాల విషయానికొస్తే... 'సూరారై పొట్రు' అనే కొత్త సినిమా ఇటీవలే మొదలైంది. మాధవన్‌తో 'సాలా ఖాదూస్', వెంకటేష్‌తో 'గురు' లాంటి బాక్సింగ్ నేపథ్యం ఉన్న చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తెలుగు నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ 'సూరారై పొట్రు' నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సూర్యతో పాటు అపర్ణ బాలమురళి, జాకీ ష్రాఫ్, మోహన్ బాబు, కరుణాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'ఎన్టీకె' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. సూర్య నటించిన మరో చిత్రం 'కాప్పన్' ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మోహన్ లాల్, ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











