దీపావళి బంపర్ బొనాంజా..ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోద్ది...
దీపావళికి ఒక్క తెలుగు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. అనువాద చిత్రాలు'సెవెన్త్ సెన్స్"తోనో, 'రా వన్"తోనో సర్దుకు పోయి కాలక్షేపం చేయాలి. మరేం ఫర్లేదు..ఈ పండక్కి తెలుగు సినిమా విడుదల కాకపోయినా..రాబోయే రోజుల్లో ధియేటర్ల దగ్గర సందడి నెలకొంటుంది. డిసెంబర్ లో చలి పులిలా విజృంభించే లోగా..మన తెలుగు సినిమాలన్నీ రెడీ అయిపోతున్నాయి.
కాగా అనువాద చిత్రాల్ని అణిచేయాలి, తెలుగు చిత్రాలు వర్థిల్లాలి అంటూ ఆ మధ్య కొందరు స్లోగన్స్ వినిపిస్తున్నారు కానీ...ఒక ఆసక్తికరమైన అనువాద చిత్రం వస్తే మాత్రం దానికోసం జనం ఎప్పటిలానే బారులు తీరతారు. 'రోబో" తర్వాత అంతగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న అనువాద చిత్రం సూర్య నటించిన 'సెవెన్త్ సెన్స్". ఈ చిత్రం పై తమిళనాడులోనే కాక ఇక్కడ కూడా భారీ అంచనాలున్నాయి.
సూర్య, మురుగదాస్ కాంబినేషన్ కి 'గజిని" కారణంగా మాస్ అప్పీల్ కూడా బ్రహ్మాండంగా ఉంది. రొటీన్ కి భిన్నమైన సినిమా అనే సంగతి స్పష్టంగా తెలుస్తూ ఉండడంతో సహజంగానే ప్రేక్షకులు దీనిని చూడాలని ఆశ పడుతున్నారు. అదీ దీపావళి నాడు విడుదలవుతోంది. కనుక తప్పకుండా ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంటుందని అంచనాలేస్తున్నారు. ఇక సినిమా బాగుంటే, అనువాద చిత్రాల్లో రోబోతో పోటీ పడినా ఆశ్చర్యం లేదు.


Click it and Unblock the Notifications











