ఒక స్టార్ హీరో సినిమాని అది ఒకప్పటి బాలయ్య హిట్ మూవీ అని గోలగోల..!?
గజిని తర్వాత మళ్లీ సూర్య, మురుగదాస్ కలిసి పని చేస్తున్న 7ఎఎయం ఆరివు చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందులో సూర్య ఫిజికల్లీ హ్యాండికేప్ట్ రోల్ చేస్తున్నాడు. టైమ్ మెషిన్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇందులో ఉందట. టైమ్ మెషిన్ లో సూర్య అటు గతంలోకి, ఇటు భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతాడట. ఇది బాలకృష్ణ నటించిన ఆదిత్య 369కథాంశంకి దగ్గరగా ఉండడంతో ఈ చిత్రం అనువాద హక్కులు కొన్న లక్ష్మీ గణపతి ఫిలింస్ వారికి టెన్షన్ పట్టుకుంది.
కొత్త కాన్సెప్ట్ అనిపించకపోతే అనువాద చిత్రాల్ని తెలుగు ప్రేక్షకలు దారుణంగా తిప్పి కొడుతూ ఉండడంతో ఈ చిత్రం నిజంగా ఆదిత్య 369ని పోలి వుంటే మన జనాలు ఇది జమానాలో చూసేశామని అంటారేమోనని వారి భయం. అసలే ఈ చిత్ర నిర్మాతలు తీసిన మన్మథన్ అంబుని తెలుగులో అనువదించి లక్ష్మీ గణపతి ఫిలింస్ వారు చేతులు కాల్చుకున్నారు...


Click it and Unblock the Notifications











