సూర్య సెవెన్త్ సెన్స్ కి సెన్సార్ కంప్లీట్..దీపావళికి విడుదల
సూర్య విభిన్న పాత్రలలో మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన '7ఆమ్ అరివు" చిత్రం తెలుగులో 'సెవెన్త్ సెన్స్" పేరిట విడుదల కానుంది. సూర్య సరసన శృతిహాసన్ కథానాయికగా నటించారు. లక్ష్మీగణపతి ఫిలింస్ సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ దీపావళికి సినిమా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా అదే రోజు విడుదలవుతున్న ఈ సినిమా 1000ప్రింట్స్ తో విడుదలకాబోతోందని సమాచారం. ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, 'యు/ఎ సర్టిఫికెట్ ఇష్యూ చేసిందని సమాచారం. భారీ అంచనాలతో విడుదలవుతన్న ఈ సినిమా 84కోట్లతో నిర్మించబడింది. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని, అత్యధిక వసూళ్ళు కురిపించి సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందని చెన్నై వర్గాలు అంటున్నాయి.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ -''ఇలాంటి భారీ చిత్రాన్ని మా బేనర్ ద్వారా విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో సూర్య పోషించిన విభిన్న పాత్రల్లో భోదిధర్మ పాత్ర ఒకటి. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. 'గజిని"తో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న సూర్య, మురుగదాస్ చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి హారీస్ జైరాజ్ మంచి పాటలిచ్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోంది. మామూలుగా సిక్త్స్ సెన్స్ అంటుంటాం. సెవెన్త్ సెన్స్ ఇప్పటివరకూ విని ఉండం. మురుగదాస్ సృష్టించిన ఈ సెవెన్త్ సెన్స్ ఓ అద్భుతం. అది ఏంటి?… అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రం కోసం సూర్య చాలా కష్టపడ్డారు" అన్నారు.


Click it and Unblock the Notifications











