'త్రీ ఇడియట్స్' రీమేక్ లో మహేష్ ప్లేసులో ఆ స్టార్ హీరో
త్రీ ఇడియట్స్ ని తెలుగు, తమిళ భాషలో శంకర్ దర్శకత్వంలో రీమేక్ చేయనున్నారనే సంగతి తెలిసిందే. అయితే తమిళంలో విజయ్, తెలుగులో మహేష్ తాము ఈ చిత్రంలో చేయమని తమదైన కారణాలు చెప్పి తప్పుకోవటంతో ఇప్పుడు శంకర్ మరో ఆఫ్షన్ ని ఎన్నుకున్నారని తెలుస్తోంది. అతను మరెవరో కాదు తమిళ హీరో సూర్య. సూర్య కు తెలుగులో కూడా మార్కెట్ ఉండటంతో అతనితో చేస్తే రెండు లాంగ్వేజ్ లలో ప్రత్యేకంగా తీయాల్సిన పని ఉండదని శంకర్ భావిస్తున్నాడని తెలుస్తోంది. రోబో వంటి సూపర్ హిట్ ఇచ్చిన తన మాట సూర్య కాదనే నమ్మకంతో ఈ ప్రపోజల్ పెట్టబోతున్నాడని చెప్తున్నారు. అయితే సూర్య రాబోయే మూడు ఏళ్ల దాకా వరసగా సినిమాలు కమిటై ఉన్నాడని తమిళ వర్గాలు చెప్తున్నాయి. దాంతో ఏదో ఒక ప్రాజెక్టుని ప్రక్కన పెట్టి ఈ సినిమాకు డేట్స్ ఇవ్వాల్సిందే తప్ప వేరే దారిలేదు అంటున్నారు.
ఇక శంకర్ ఎలాగైనా ఈ ప్రాజెక్టుని మెటీరియలైజ్ చేయాలని పట్టుదలతో స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని స్టార్స్ ఎంపిక చేస్తున్నారు. హిందీలో శర్మాన్ జోషి చేసిన పాత్రను తెలుగు, తమిళంలో శ్రీరామ్(ఒకరికి ఒకరు ఫేమ్) చేస్తారు. ఇక మాధవన్ పాత్రకు తమిళ హీరో జీవాని ఎంపిక చేసారు. ఇలియానా..కరినా కపూర్ పాత్రకు, సత్యరాజ్..బొమన్ ఇరాని చేసిన ప్రొపిసర్ పాత్రలో కనిపించనున్నారు. హ్యారీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఏ మాయ చేసావేకి కెమెరా వర్క్ చేసిన మనోజ్ పరమహంసని ఛాయా గ్రహణంకు ఎంపిక చేసారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రం అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. టైటిల్ గా త్రీ రాస్కేల్స్ అని పెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సూర్య చేస్తే..అతని సూపర్ హిట్ గజనీ హిందీలో అమీర్ ఖాన్ చేసారు..అమీర్ ఖాన్ సూపర్ హిట్ సూర్య చేసినట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications











