సూర్య వెరైటీ మీసాలు
నటుడు సూర్యకు 'మిస్టర్ పర్ఫెక్ట్' అని పేరు. తను ఒప్పుకున్న పాత్ర కోసం తన శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టడానికి వెనుకాడడు. తన తాజా చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో 19 ఏళ్ల కుర్రాడిగా కనిపించడానికి నెలల తరబడి కడుపు మాడ్చుకొని సన్నబడ్డారు. తాజా ఇప్పుడు తాను నటిస్తున్న చిత్రం 'సింగమ్' సినిమా కోసం వెరైటీగా మీసాలు పెంచాడుట. ఈ చిత్రం సూర్య ఓ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
ఇంతకు ముందు సూర్య పోలీస్ అధికారిగా నటించిన 'కాక్క కాక్క' చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఈ చిత్రం పై సాధారణంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం తెలుగులో కూడా అనువాదం కానుంది. ఈ చిత్రంలో సూర్య సరసన 'బొమ్మాళి' అనుష్క కథానాయికగా నటిస్తోంది.
surya singam veedokkade tamanna anushka arundathi surya so krishnan సూర్య సింగమ్ వీడొక్కడే తమన్నా అనుష్క అరుంధతి సూర్య సన్నాఫ్ కృష్ణన్


Click it and Unblock the Notifications