ఎవిఎమ్ తదుపరి చిత్రం
రజనీకాంత్ తో శివాజీ సినిమా తరువాత ఎవిఎమ్ సంస్థ హీరో సూర్యతో సినిమాకు సిద్ధమవుతోంది. గతంలో సూర్యతో ఈ సంస్థ పెరజగన్ అనే సూపర్ హిట్ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కెవి ఆనంద్ దర్శకత్వం వహించనుండగా హారిస్ జయ్ రాజ్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నది. ఇంకా ఈ సినిమాకు పేరు పెట్టలేదు. ప్రస్తుతం సూర్య గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న వారణమ్ ఆయిరమ్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎవిఎమ్ సంస్థ శివాజీ సినిమాను హిందీలోకి డబ్ చేసే పనిలో పడింది.


Click it and Unblock the Notifications











